Rishabh Pant-Sanjeev Goenka
IPL LSG Rishabh Pant-Sanjeev Goenka: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అనగానే టక్కున అందరికీ గుర్తుకు వచ్చేది కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2025 సీజన్ లో లక్నో టీమ్ ఓడిపోయిన తర్వాత సంజీవ్ గోయెంకా గ్రౌండ్ లోనే కేల్ రాహుల్ తో దారుణంగా నడుచుకున్న తీరు ఎవరూ మర్చిపోలేరు. ఆ ఘటన తర్వాత కేఎల్ రాహుల్ లక్నో టీమ్ కు గుడ్ బై చెప్పాడు.
ఇప్పుడు కేఎల్ రాహుల్ స్థానంలో లక్నో టీమ్ లోకి స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్ వచ్చాడు. ఐపీఎల్ 2025లో ఆడిన మూడో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రెండోసారి ఓటమి పాలైంది. పంజాబ్ 8 వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది.
ఈ ఓటమి తర్వాత, మరోసారి గత సీజన్‌లో కెఎల్ రాహుల్‌తో కనిపించిన అదే దృశ్యం ఎకానా స్టేడియంలో కనిపించింది. కేఎల్ రాహుల్ గోయెంకా తిట్టడాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అప్పుడు నెటిజట్లు, క్రికెట్ లవర్స్ గోయెంకాను టార్గెట్ చేస్తూ ఒక ఆటాడుకున్నారు. అది మర్చిపోయారు అనుకునేలోపు అలాంటి ఫోటోలే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ రిషబ్ పంత్ తో ఉన్న ఫోటోలు వైరల్ కావడంతో నెటిజట్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Image Credit: TwitterLucknow Super Giants
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ప్లేయర్ రిషబ్ పంత్
ఐపీఎల్ 2025 వేలంలో లక్నో జట్టు రిషబ్ పంత్ కోసం చాలా డబ్బు ఖర్చు చేసింది. పంత్ కోసం గోయెంకా రూ.27.75 కోట్లు వేలం వేశారు. అయితే, అతని ధరకు తగ్గట్టుగా రిషబ్ పంత్ నుంచి ధనాధన్ ఇన్నింగ్స్ రాలేదు. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పంత్ గొప్పగా పరుగులు చేయలేకపోయాడు.
ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పంత్ పరుగుల ఖాతా తెరవలేదు. 2వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. 3వ మ్యాచ్ లో పంజాబ్‌పై 2 పరుగులు మాత్రమే చేశాడు. దీనికి తోడూ పంత్ కెప్టెన్సీ వ్యూహాలు జట్టుకు విజయాన్ని అందించలేకపోయాయి. పంజాబ్ చేతిలో ఓటమి తర్వాత, గోయెంకా కెప్టెన్ పంత్ తో మాట్లాడుతూ కనిపించాడు. సోషల్ మీడియాలో వారిద్దరి ఫోటోలపై అభిమానులు భిన్నమైన కామెంట్స్ చేస్తున్నారు.
KL Rahul_Sanjiv Goenka
కేఎల్ రాహుల్ గుర్తుచేసుకుంటూ క్రికెట్ లవర్స్ కామెంట్స్
ఐపీఎల్ 2024లో లక్నో జట్టు ఎకానా స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఆ తర్వాత గోయెంకా కెమెరా ముందు కెఎల్ రాహుల్‌ను తిట్టాడు. అతని వీడియో సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. గోయెంకా తీరును చాలా మంది క్రికెట్ దిగ్గజాలు కూడా విమర్శించారు. ఇప్పుడు మూడు మ్యాచ్ లలో రాణించలేకపోయిన రిషబ్ పంత్ తో గ్రౌండ్ లో మాట్లాడటం హాట్ టాపిక్ అవుతోంది. మరీ ఐపీఎల్ 2025 సీజన్ ముగిసే లోపు ఏం జరుగుతుందోనని క్రికెట్ వర్గాల్లో ఉత్కంఠను పెంచింది.
సోషల్ మీడియా పోస్టులు ఇక్కడ చూడండి
👉 1
👉 2
👉 3