Venkatesh Iyer silences critics with tsunami innings KKR vs SRH
Venkatesh Iyer: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మెగా వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ₹23.75 కోట్లకు తమ టీమ్ లోకి తీసుకున్న తర్వాత వెంకటేష్ అయ్యర్ వరుస పేలవమైన ప్రదర్శనలతో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు. అయితే, తన కోసం కేకేఆర్ ఖర్చు చేసిన కోట్ల రూపాయలకు న్యాయం చేసే ప్లేయర్ నంటూ సునామీ ఇన్నింగ్స్ తో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో జరిగిన ఐపీఎల్ 2025 15లో అద్భుతమైన ఆటతో విమర్శకుల నోళ్లు మూయించాడు.
ఐపీఎల్ 2025 సీజన్ మొదలైన తర్వాత వెంకటేష్ అయ్యర్ గొప్ప ఇన్నింగ్స్ లను ఆడలేకపోయాడు. దీంతో అతని కోసం కేకేఆర్ కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై విమర్శలు వచ్చాయి. క్రికెట్ అభిమానులు, నిపుణులు కేకేఆర్ అయ్యర్ ను జట్టుతోనే ఉంచుకోవడంపై ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ, వారందరికీ హైదరాబ్ టీమ్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఇన్నింగ్స్ తో సమాధానమిచ్చాడు.
Venkatesh Iyer silences critics with tsunami innings KKR vs SRH
ఈ మ్యాచ్ లో కేకేఆర్ 150 పరుగులైనా చేస్తుందా అనుకున్న సమయం నుంచి ఏకంగా డబుల్ సెంచరీ స్కోర్ చేయడం చేరుకోవడంలో వెంకటేష్ అయ్యర్ సునామీ ఇన్నింగ్స్ కీలక పాత్ర పోషించింది. మొదట్లో దూకుడుగా ఆడలేదు. మొదటి 10 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. కానీ, ఆ తర్వాత తన విశ్వరూపం మొదలుపెట్టాడు. ఫోర్లు సిక్సర్లు బాదుతూ హాఫ్ సెంచరీ కొట్టాడు. 29 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
మహమ్మద్ షమీ వేసిన 16వ ఓవర్లో అయ్యర్ అద్భుతమైన బ్యాటింట్ తో 2 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత మరింత రెచ్చిపోతూ SRH కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బౌలింగ్ ను దంచికొట్టాడు. 2 భారీ సిక్సర్లతో పాటు మరో 2 ఫోర్లు బాదాడు. ఈ ఓవర్ లో 21 పరుగులు చేసి కేవలం 25 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. మొత్తంగా తన 60 పరుగుల ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అయ్యర్ బ్యాటింగ్ 206.89 స్ట్రైక్ రేట్ తో సాగింది. ఇది SRH పై వెంకటేష్ అయ్యర్ వరుసగా మూడో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అంతకుముందు ఐపీఎల్ 2024 క్వాలిఫైయర్ 1లో 51* పరుగులు, ఫైనల్‌లో 52* పరుగుల ఇన్నింగ్స్ లను ఆడాడు.
Venkatesh Iyer silences critics with tsunami innings KKR vs SRH
వెంకటేష్ అయ్యర్ ఐపీఎల్ కెరీర్
స్టార్ ఆల్ రౌండర్ అయిన వెంకటేశ్ అయ్యర్ 2021లో ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు కోసం అద్భుతమైన ఇన్నింగ్స్ లను ఆడాడు. తన తొలి ఐపీఎల్ సీజన్ లో అదిరిపోయేలా బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించాడు. ఐపీఎల్ 2021లో వెంకటేష్ అయ్యర్ ప్రదర్శన గమనిస్తే.. ఆడిన 10 మ్యాచ్‌లలో 41.11 సగటు, 128.47 స్ట్రైక్ రేట్‌తో 370 పరుగులు చేశాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ లో 8.11 ఎకానమీ రేట్‌తో 3 వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2022 గొప్పగా లేదు కానీ, ఆ తర్వాత అంటే 2023 ఐపీఎల్ ఎడిషన్ లో వెంకటేష్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్ లో అదరగొట్టాడు. ఈ ఎడిషన్ లో తన తొలి సెంచరీని కొట్టడంతో పాటు 2 హాఫ్ సెంచరీలతో 404 పరుగులు చేశాడు. కేవలం 51 బంతుల్లోనే సెంచరీ కొట్టి బ్రెండన్ మెకల్లమ్ తర్వాత కేకేఆర్ తరఫున రెండో వేగవంతమైన సెంచరీని సాధించాడు.
ఐపీఎల్ 2024లో 46.25 సగటు, 158 పైగా స్ట్రైక్ రేట్ తో అద్భుతమైన బ్యాటింగ్ చేసి 370 పరుగులు కొట్టాడు. ఇందులో 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్ మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో నాటౌట్ గా నిలిచాడు.