ఐపీఎల్ వచ్చాక టీమిండియా ఇలా తయారైంది... సచిన్ టెండూల్కర్ కామెంట్స్...

First Published Dec 6, 2021, 4:24 PM IST

ఐసీసీ టైటిల్ గెలవడం లేదనే మాటే తప్ప, ద్వైపాక్షిక సిరీసుల్లో భారత జట్టు హవా కొనసాగుతోంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వంటి జట్లకు కూడా చుక్కలు చూపిస్తోంది. భారత జట్టు ఇంత పటిష్టంగా మారడానికి ఐపీఎల్‌యే కారణమంటున్నాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

2008లో ప్రారంభమైన ఐపీఎల్, 14 సీజన్లను పూర్తి చేసుకుంది. వచ్చే సీజన్‌లో 10 జట్లు బరిలో దిగబోతున్నాడు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్‌కి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది...

ఐపీఎల్ ఫ్రాంఛైజీ కోసం లక్నో టీమ్ ఏకంగా రూ.7090 కోట్లు చెల్లించడానికి సిద్ధమైందంటే... భారత ప్రీమియర్ లీగ్‌కి ఉన్న క్రేజ్‌ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు...

ఐపీఎల్ ద్వారా ఎంతో మంది క్రికెటర్లు భారత జట్టులోకి వచ్చారు. టీమిండియాలో కీ ప్లేయర్లుగా మారిన జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్ ఐపీఎల్ నుంచి వచ్చినవాళ్లే...

వీరితో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన నటరాజన్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహార్, వాషింగ్టన్ సుందర్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి వంటి ఎందరో యువ క్రికెటర్లు భారత జట్టులో చోటు దక్కంచుకోగలిగారు...

‘భారత జట్టు ఏదో అనుకోకుండా ఇలా పటిష్టంగా మారిపోలేదు. దీని వెనక చాలా శ్రమ, గ్రౌండ్ వర్క్ ఉన్నాయి. భారత జట్టును పటిష్టం చేయడానికి ఎన్నో విషయాలు దోహదం చేశాయి...

అన్నింటికీ మించి, ఐపీఎల్ వచ్చిన తర్వాత భారత జట్టు ప్రదర్శన మరింత మెరుగైంది. దేశవాళీ క్రికెటర్లకు తమ సత్తా, టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఓ వేదిక దొరికింది...

వరల్డ్ క్లాస్ క్రికెటర్లతో కలిసి గడపడం వల్ల వారికి అంతర్జాతీయ మ్యాచుల ఆరంగ్రేటానికి ముందే కావాల్సిన అనుభవం లభించింది. అలాగే ట్రైయినింగ్ పద్ధతులు కూడా మారాయి...

ఇప్పుడు భారత క్రికెటర్ల ఆలోచన కూడా పూర్తిగా మారిపోయింది. తొలి మ్యాచ్‌లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నారు. దీనికి కారణం ఐపీఎల్...

ఐపీఎల్ ఆరంభంలో వేసిన విత్తనాలు ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయి. దేన్ని ఆశించి, ఐపీఎల్‌ను తీసుకువచ్చారో, అది ఇన్నాళ్లకు నెరవేరింది...

నా తరం, నా ముందు తరం క్రికెటర్లు ఇచ్చిన స్ఫూర్తి, నేటి క్రికెటర్ల మరింత మెరుగ్గా రాణించడానికి దోహదం చేసింది... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్...

click me!