ఐపీఎల్ నా జీవితాన్నే మార్చేసింది, ఆ డబ్బులతో... క్రిస్ మోరిస్ కామెంట్...

First Published Mar 31, 2021, 9:51 AM IST

ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేలానికి విడుదల చేసిన ఈ ప్లేయర్‌ను, రాజస్థాన్ రాయల్స్‌ ఏకంగా రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది...

యువరాజ్ సింగ్ రూ.16 కోట్ల రికార్డును బ్రేక్ చేసిన క్రిస్ మోరిస్, ఐపీఎల్‌లో ఎనిమిదో సీజన్ ఆడేందుకు భారత్‌లోకి అడుగుపెట్టాడు... ఈ సందర్భంగా ఐపీఎల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు క్రిస్ మోరిస్..
undefined
‘నిజం చెప్పాలంటే ఐపీఎల్ నా జీవితాన్ని మార్చేసింది... నా కోసం ఓ జట్టు ఇంత ధర వెచ్చిస్తుందని నేను ఊహించలేదు... ఇది చాలా గొప్ప గౌరవంగా భావిస్తున్నా...
undefined
ఇప్పుడు నా జీవితంలో చాలా ప్రశాంతత ఏర్పడింది. ప్రశాంతంగా శ్వాస తీసుకుంటున్నా... నేను ఇన్ని సీజన్లు ఐపీఎల్‌లో ఆడతానని కూడా అనుకోలేదు. కానీ గొప్ప గొప్ప ఆటగాళ్లలో ఆడగలగడం ఓ అద్భుతమైన అవకాశం...
undefined
అందుకే ఐపీఎల్‌లో కొనసాగుతున్నాను... జీవితాన్ని మార్చేసే మూమెంట్ ఏదైనా ఉందంటే, అది నా దృష్టిలో ఐపీఎల్ మాత్రమే... వ్యక్తిగతంగా, ఆటపరంగా, ఆర్థికంగా... అన్ని విధాలు ఐపీఎల్ నా జీవితాన్ని మార్చేసింది...
undefined
నేను ఐపీఎల్ ద్వారా వచ్చిన డబ్బుతో ఏమేం కొనాలో ప్లాన్ చేసుకుంటున్నా. నా కుటుంబాన్ని ఏ లోటు లేకుండా చూసుకోవాలని అనుకుంటున్నా... అంతేకాదు మా పిల్లలు స్కూల్ నుంచి యూనివర్సిటీ చదువులకి వెళ్లేదాకా అన్నీ సమకూర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నా...
undefined
హాలీడేస్‌కి తీసుకెళ్లేందుకు... ఈ డబ్బు నాకెంతో ఉపయోగపడుతుంది... ఇంత భారీ ధరకు కొనుగోలు చేసినప్పుడు ఒత్తిడి ఉంటుందని అందరూ అంటున్నారు. కానీ నా విషయంలో అది పెద్ద విషయం కాదు..’ అంటూ చెప్పుకొచ్చాడు క్రిస్ మోరిస్...
undefined
రాజస్థాన్ రాయల్స్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ మొత్తానికి దూరమయ్యే పరిస్థితి ఉండడంతో రాయల్స్‌కి మోరిస్ కీలకం కానున్నాడు...
undefined
టీ20 వరల్డ్‌కప్ 2021 సమీపిస్తున్నప్పటికీ, నా జట్టుకి (రాజస్థాన్ రాయల్స్) ఐపీఎల్ టైటిల్ అందించడంపైన ఇప్పుడు ప్రధానంగా దృష్టి పెట్టానని కామెంట్ చేశాడు క్రిస్ మోరిస్...
undefined
click me!