ఐపీఎల్ 2021: ఈ సారి కూడా టైటిల్ ఫెవరెట్ ముంబై ఇండియన్సే... - సునీల్ గవాస్కర్!

First Published | Mar 31, 2021, 7:34 AM IST

ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన జట్టు ముంబై ఇండియన్స్. భారత ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎనిమిది సీజన్లలో ఐదుసార్లు టైటిల్ ఛాంపియన్‌గా నిలిచిన ముంబై, ఈసారి కూడా టైటిల్ ఫెవరెట్ అంటున్నాడు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్. 

ఇప్పటికే విడుదలైన ఐపీఎల్ 2021 ప్రొమోలో కూడా ఇంకో కప్పు కావాలని చెప్పాడు రోహిత్ శర్మ. భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్ కూడా ఈసారి కూడా ముంబై టైటిల్ గెలవడం ఖాయమని అంటున్నాడు..
‘పటిష్టమైన ముంబై ఇండియన్స్‌ను ఈసారి కూడా ఓడించడం ఏ జట్టుకైనా కష్టమే.. ఈసారి మరింత ఉత్సాహంతో, జోష్‌లో ముంబై ఆటతీరు ఉండబోతుందని అనుకుంటున్నా...

ముంబై ఇండియన్స్ ప్లేయర్లు సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ ఇప్పటికే టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఆరంగ్రేటం సిరీస్‌లోనే అదరగొట్టిన ఈ ప్లేయర్లు, మరింత జోష్‌తో ఐపీఎల్ 2021 సీజన్‌లో ఆడబోతున్నారు...
హార్ధిక్ పాండ్యా తిరిగి బౌలింగ్ చేయబోతుండడం ముంబైకి మరింత బలాన్ని చేకూర్చే అంశం... అదీకాకుండా కృనాల్ పాండ్యా, తన మొదటి వన్డేలోనే అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు...
కిరన్ పోలార్డ్‌, రోహిత్ శర్మతో సహా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ ప్లేయర్లు అందరూ ఫుల్లీ లోడెడ్ గన్‌లా కనిపిస్తున్నారు... ఐపీఎల్ ప్రారంభం కాగానే ఈ గన్స్ నుంచి బుల్లెట్ల వర్షం కురవడం ఖాయం...
నా దృష్టిలో ఐపీఎల్ 2021 సీజన్ టైటిల్ ఫెవరెట్ కూడా ముంబై ఇండియన్స్ జట్టే... ’ అంటూ చెప్పుకొచ్చాడు సునీల్ గవాస్కర్...
‘టీమిండియాలో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లలో ఒక్కరూ కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. రాహుల్ తెవాటియా జట్టుకి ఎంపికైనా ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ కావడంతో అతనికి అవకాశం దక్కలేదు...
రాయల్ ఛాలెంజర్స్ టీమ్ మెయిన్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. అతని ఫామ్, ఆర్‌సీబీని ఆందోళనకు గురి చేసే అంశం...
కుల్దీప్ యాదవ్ కూడా ధారాళంగా పరుగులు సమర్పించాడు. అతనికి కేకేఆర్ అవకాశం ఇవ్వడానికి కూడా భయపడొచ్చేమో... వరుణ్ చక్రవర్తి కూడా ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిల్ అయ్యాడు’ అంటూ అభిప్రాయపడ్డాడు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సునీల్ గవాస్కర్.
ఏప్రిల్ 9న డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్‌లో ఐపీఎల్ 2021 సీజన్ ప్రారంభం కానుంది...

Latest Videos

click me!