ఐపీఎల్‌ను వదులుకుని, టెస్టు సిరీస్ ఆడలేం... ఇంగ్లాండ్‌ జట్టుకి షాకిచ్చిన జోస్ బట్లర్!!

Published : Mar 11, 2021, 01:02 PM IST

ఆటగాడి కంటే డబ్బులకే ఎక్కువ విలువనిచ్చే ఐపీఎల్ ఆడడం కంటే, పీఎస్‌ఎల్, ఎల్‌పీఎల్ ఆడడంలోనే తనకు సంతృప్తిగా ఉంటుందని సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్ కామెంట్ చేస్తే... తన జట్టుకి ఆడడం కంటే, ఐపీఎల్ ఆడడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్...

PREV
19
ఐపీఎల్‌ను వదులుకుని, టెస్టు సిరీస్ ఆడలేం... ఇంగ్లాండ్‌ జట్టుకి షాకిచ్చిన జోస్ బట్లర్!!

గత సీజన్‌లో ఆఖరి స్థానంలో నిలిచిన రాజస్థాన్ రాయల్స్‌కి ఆడుతున్న ఇంగ్లాండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్, ఐపీఎల్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం టీమిండియాతో టీ20 సిరీస్‌కి సిద్దమవుతున్నాడు బట్లర్...

29

‘ఐపీఎల్ 2021 సీజన్‌ను మధ్యలో వదిలేసి, న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌కి వెళ్లడంపై నాతో ఎవ్వరూ మాట్లాడలేదు. మిగిలిన ఆటగాళ్ల గురించి నాకు తెలియదు కానీ ఐపీఎల్ నాకు చాలా ముఖ్యం...

39

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రకటించకముందే ఐపీఎల్‌ ఫ్రాంఛైజీతో నేను ఒప్పందం చేసుకున్నా. ఒకవేళ రాజస్థాన్ రాయల్స్‌కి ప్లేఆఫ్‌కి చేరుకుంటే మాత్రం, టెస్టు సిరీస్ ఆడలేకపోవచ్చు...

49

అయినా ఇంగ్లాండ్‌కి టెస్టుల్లో ప్రతీసారి కొందరు ఆటగాళ్లను పక్కనబెడుతూనే ఉన్నారు. కాబట్టి నాలాంటి ప్లేయర్లు లేకపోయినా ఎలాంటి నష్టం జరగదు... టీమిండియాతో కలిసి నేను ఆడింది ఒకే టెస్టు అని తెలుసుకోవాలి...

59

ఐపీఎల్ ప్రతీ ప్లేయర్‌కి చాలా ముఖ్యమైన లీగ్. దీని వల్ల ఎలాంటి ప్రయోజనాలు అందుకున్నాయో అందరికీ తెలుసు. కోట్లల్లో డబ్బు వస్తోంది. స్టార్ ఆటగాళ్లతో కలిసి క్రికెట్ ఆడే అద్భుత అవకాశం దొరుకుతోంది...

69

ఈ అనుభవం ఇంగ్లాండ్ ఆటగాళ్లకి కూడా ఎంతో అవసరం. బిజీ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్ల రొటేషన్ పద్ధతిని ఎంచుకున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు మాకు మంచి వేతనాలు ఇస్తోంది. ఇంగ్లాండ్‌కి ఆడడాన్ని గౌరవంగా భావిస్తాం కానీ ఐపీఎల్ డబ్బులతో చాలామందికి అవసరం ఉంటుంది’ అంటూ కామెంట్ చేశాడు జోస్ బట్లర్.

79

అయితే బట్లర్ కామెంట్‌తో జాతీయ జట్టుకి ఆడడం కంటే, ఐపీఎల్‌కి ఆడడానికి ప్రాధాన్యం ఇచ్చే ఆటగాళ్ల జీతాల్లో కోత విధించాలంటూ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డును ఆదేశించాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జోఫెరీ బాయ్‌కాట్... 

89

గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహారించిన స్టీవ్ స్మిత్‌ను వేలానికి వదిలేసిన రాజస్థాన్ రాయల్స్, యంగ్ ప్లేయర్ సంజూ శాంసన్‌కి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే...

99

షెడ్యూల్ ప్రకారం మే 30న ఐపీఎల్ 2021 సీజన్ ఫైనల్ ముగుస్తుంది. జూన్ 2 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడనుంది ఇంగ్లాండ్. అయితే క్వారంటైన్ నిబంధనల కారణంగా రాజస్థాన్ ప్లేఆఫ్ చేరితే బట్లర్, టెస్టు సిరీస్ ఆడడం కష్టమవుతుంది...

click me!

Recommended Stories