IPL 2025, GT vs PBKS:GT vs PBKS: గ్లెన్ మ్యాక్స్ వెల్ విధ్వంసం సృష్టిస్తాడు అనుకుంటే తుస్సు మన్నాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే పెవిలియన్ కు చేరాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 5వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్-గుజరాత్ టైటాన్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తన విధ్వంసక బ్యాటింగ్ తో హాట్ టాపిక్ అవుతుండగా, తను తన సొంత సహచరుడు గ్లెన్ మాక్స్‌వెల్ కు మాత్రం విలన్ అయ్యాడు. అయ్యర్ కారణంగా ఈ ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్‌లు అయిన ప్లేయర్ గా చెత్త రికార్డు సాధించాడు.
గ్లెన్ మాక్స్వెల్ 0 పరుగులకే పెవిలియన్ కు చేరాడు
టాస్ గెలిచిన గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కు ఆరంభం అద్భుతంగా ఉంది. అరంగేట్ర ఆటగాడు ప్రియాంష్ ఆర్య కేవలం 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో, కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 97 పరుగుల అద్భుమైన నాక్ ఆడాడు. 16 పరుగుల వద్ద ఉమర్జాయ్ వికెట్ పడిపోవడంతో అందరూ మాక్స్‌వెల్‌పై చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ సాయి సుదర్శన్ మొదటి బంతికే గ్లెన్ మ్యక్స్ వెల్ ను అవుట్ చేశాడు.
మ్యాచ్ వెల్ కు శ్రేయాస్ అయ్యర్ విలన్ గా ఎలా మారాడు?
సుదర్శన్ వేసిన బంతికి గ్లెన్ మాక్స్‌వెల్ రివర్స్ స్వీప్ ఆడటానికి ప్రయత్నించాడు కానీ బంతి బ్యాట్‌కు బదులుగా ప్యాడ్‌ను తాకింది. దీంతో అంపైర్ అవుట్ ప్రకటించాడు. ఆ తర్వాత మ్యాక్స్ వెల్ శ్రేయాస్ అయ్యర్ నుండి సమీక్ష తీసుకోవానికి సలహా కోరగా దానికి నో చెప్పాడు. రివ్యూ తీసుకోకపోవడంతో అవుట్ గా క్రీజు వదిలాడు. కానీ, రిప్లేలో బంతి స్టంప్స్‌ను తాకలేదనీ, మాక్స్‌వెల్ నాటౌట్‌గా అని వెల్లడైంది. కానీ, సమీక్ష తీసుకోకుండానే పెవిలియన్ కు చేరాడు.
గ్లెన్ మాక్స్‌వెల్ చెత్త రికార్డు
మ్యాక్స్ వెల్ రోహిత్ శర్మను అధిగమించాడు. ఐపీఎల్ చరిత్రలో గ్లెన్ మాక్స్‌వెల్ పేరిట ఒక చెత్తరికార్డు నమోదైంది. ఐపీఎల్ లో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా నిలిచాడు. మ్యాక్స్ వెల్ 130 ఇన్నింగ్స్‌లలో 19 సార్లు సున్నాకే అవుట్ అయ్యాడు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ 253 ఇన్నింగ్స్‌లలో 18 సార్లు డకౌట్ అయ్యాడు.
ఐపీఎల్ లో అత్యధిక డకౌట్లు
19 - గ్లెన్ మ్యాక్స్ వెల్
18 - రోహిత్ శర్మ
18 - దినేశ్ కార్తీక్
16 - పీయూష్ చావ్లా
16 - సునీల్ నరైన్