IPL 2025, GT vs PBKS: గుజరాత్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా !
IPL 2025, GT vs PBKS: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా. క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్టుగా గిల్ టీమ్ బౌలింగ్ ను దంచికొట్టారు.
IPL 2025, GT vs PBKS: పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు గుజరాత్ టైటాన్స్ ను చెడుగుడు ఆడుకున్నారు భయ్యా. క్రీజులోకి వచ్చినవాళ్లు వచ్చినట్టుగా గిల్ టీమ్ బౌలింగ్ ను దంచికొట్టారు.
IPL 2025, GT vs PBKS: శుభ్ మన్ గిల్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ను పంజాబ్ కింగ్స్ చెడుగుడు ఆడుకున్నారు భయ్యా. ఏమాత్రం కనికరం లేకుండా ఫోర్లు, సిక్సర్లు బాదుతూ జీటి బౌలర్లను దంచికొట్టారు. వచ్చిన వారు వచ్చినట్టుగా తుఫాను ఇన్నింగ్స్ ఆడటంతో ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. గత సీజన్ లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్ ఇప్పుడు పంజాబ్ కింగ్స్ తరఫున ఆడుతున్నాడు. పంజాబ్ కెప్టెన్ గా తన తొలి మ్యాచ్ లోనే అద్భుతమైన 97 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. 230.95 స్ట్రైక్ రేట్‌తో సాగిన అతని ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు పంజాబ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ప్రియాంష్ ఆర్య పంజాబ్ తరఫున అరంగేట్రం చేసి ఓపెనర్‌గా మైదానంలో విధ్వంసం సృష్టించాడు. ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ కేవలం 23 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో పంజాబ్ కు గొప్ప ఆరంభం లభించింది. ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన నాక్ ఆడాడు. చివరలో శశాంక్ సింగ్ బ్యాటింగ్ సునామీ రేపాడు.
శ్రేయాస్ అయ్యర్ గుజరాత్ బౌలర్లను చీల్చిచెండాడుతూ కేవలం 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా అద్భుతమైన ఆటతో సెంచరీకి దగ్గరగా వచ్చాడు. కానీ, చివరలో శశాంక్ సింగ్ మెరుపు ఇన్నింగ్స్ తో పంజాబ్ స్కోర్ బోర్డును మరింత పరుగులు పెట్టించాడు. శశాంక్ కేవలం 16 బంతుల్లో 44 పరుగుల తన ఇన్నింగ్స్ లో 2 సిక్సర్లు, 6 ఫోర్లు బాదాడు.
అయ్యర్ సెంచరీ మిస్
ఇన్నింగ్స్ చివరి ఓవర్లో శశాంక్ సింగ్ స్ట్రైక్‌లో ఉన్నాడు. మహ్మద్ సిరాజ్ ఓవర్లో అతను వరుసగా ఫోర్ల వర్షం కురిపించాడు. అయ్యర్ తన తొలి ఐపీఎల్ సెంచరీకి కేవలం 3 పరుగుల దూరంలో ఉండటంతో, శ్రేయాస్ అయ్యర్ స్ట్రైక్‌లోకి వస్తాడని అందరూ ఎదురు చూశారు. కానీ శశాంక్ ఆగలేదు, అతను ఓవర్‌ను ఫోర్‌తో ప్రారంభించి, ఆపై రెండు పరుగులు తీసుకున్నాడు. దీని తర్వాత ఫోర్ల వర్షం కురిపించాడు. ఈ ఓవర్లో ఒక వైడ్ తో సహా మొత్తం 23 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో శశాంక్ 5 ఫోర్లు కొట్టగా, అయ్యర్ తన సెంచరీకి 3 పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 20 ఓవర్లలో పంజాబ్ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ టీమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేసింది.
గుజరాత్ టీమ్ నెమ్మదిగా ఇన్నింగ్స్ ను ప్రారంభించింది కానీ, మ్యాచ్ లో చివరి ఓవర్ వరకు గెలుపు కోసం ఫైట్ చేసింది. కానీ, విజయాన్ని అందుకోలేకపోయింది. పంజాబ్ కింగ్స్ (PBKS) 2025 ఐపీఎల్ సీజన్‌లో తన తొలి మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ (GT) పై 11 పరుగులతో ఉత్కంఠభరితమైన విజయాన్ని సాధించింది. గుజరాత్ బ్యాటింగ్ లో సాయి సుదర్శన్ ధనాధన్ ఇన్నింగ్స్ తో 41 బంతుల్లో 74 పరుగులు ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. గిల్ 33, జోస్ బట్లర్ 54, రూథర్ ఫర్డ్ 46 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు.
తన బ్యాటర్ల విధ్వంసంతో పంజాబ్ టీమ్ ఐపీఎల్ లో తన రెండో అత్యధిక టీమ్ స్కోర్ ను నమోదుచేసింది.
IPLలో PBKS కి అత్యధిక స్కోరు
262/2 vs KKR, కోల్‌కతా, 2024
243/5 vs GT, అహ్మదాబాద్, 2025
232/2 vs RCB, ధర్మశాల, 2011
231/4 vs CSK, కటక్, 2014
230/3 vs MI, వాంఖడే, 2017
అలాగే, గుజరాత్ టీమ్ గత సిక్సర్ల రికార్డును అధిగమించింది. ఐపీఎల్ 2023లో అహ్మదాబాద్ లో ఎల్ఎస్జీపై జీటీ 14 సిక్సర్ల రికార్డును అధిగమిస్తూ పంజాబ్ టీమ్ పై 16 సిక్సర్లు కొట్టింది. 2023తో ముంబై ఇండియన్స్ పై చేసిన 233/3 అత్యధిక పరుగుల తర్వాత ఇప్పుడు 232/5 పరుగులతో రెండో అత్యధిక స్కోర్ ను నమోదుచేసింది.