IPL 2025: గుజరాత్ టైటన్స్’ వెటరన్ లెగ్ స్పిన్నర్, రషీద్ ఖాన్, ఐపీఎల్ చరిత్రలో 150 వికెట్లు సాధించిన 3వ వేగవంతమైన బౌలర్ గా ఘనత సాధించాడు. ఐపీఎల్ 2025 సీజన్ 5 మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి. మ్యాచ్‌లో తొలి వికెట్ తీసి ఈ ఘనత సాధించాడు.
రషీద్ ఇప్పుడు ప్రత్యేకమైన క్లబ్‌లో చేరాడు. 150 వికెట్లు సాధించిన వేగవంతమైన 3వ బౌలర్‌గా నిలిచాడు. అత్యంత వేగంగా 150 వికెట్లు సాధించిన బౌలర్ల లిస్టులో మలింగా (105 మ్యాచ్‌లు), యుజ్వేంద్ర చాహల్ (118 మ్యాచ్‌లు) తర్వాత రషీద్ ఖాన్ ఉన్నాడు. రషీద్ 150 ఐపీల్ వికెట్ల మార్కును 122వ మ్యాచ్‌లో సాధించాడు. అలాగే, ఈ టోర్నీలో 150 వికెట్లు సాధించిన 12వ ఆటగాడిగా నిలిచాడు.
IPL 2025, GT vs PBKS: Rashid Khan surpasses Jasprit Bumrah
అత్యంత వేంగంగా IPLలో 150 వికెట్లు సాధించిన ప్లేయర్లు
మలింగా – 105 మ్యాచ్‌లు
యుజ్వేంద్ర చాహల్ – 118 మ్యాచ్‌లు
రషీద్ ఖాన్ – 122 మ్యాచ్‌లు
జస్ప్రీత్ బుమ్రా – 124 మ్యాచ్‌లు
డ్వేన్ బ్రావో – 137 మ్యాచ్‌లు
భువనేశ్వర్ కుమార్ – 138 మ్యాచ్‌లు
రషీద్ ఐపీఎల్ విజయాలు కేవలం వికెట్ల వరకే పరిమితం కాలేదు. బ్యాటింగ్ లో కూడా రాణించాడు. 6.8 ఎకానమీ రేటులో బౌలింగ్ వేశాడు. కనీసం 65 ఐపీఎల్ వికెట్లు సాధించిన బౌలర్లలో ఇవే బెస్ట్ గణాంకాలు. అతని ఐపీఎల్ కెరీర్ గరిష్ట సగటు 18.8 కంటే తక్కువగా ఉంది. కాగా, రషీద్ ఖాన్ 2017లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)తో తన ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చాడు. SRH జట్టుతో 76 మ్యాచ్‌లు ఆడి 93 వికెట్లతో 6.33 ఎకానమీ రేటును సాధించాడు.
IPL 2025, GT vs PBKS: Rashid Khan surpasses Jasprit Bumrah
2022లో గుజరాత్ టైటన్స్‌లోకి వచ్చిన రషీద్ ఖాన్ ఈ జట్టు బౌలింగ్ దాడిలో కీలక పాత్ర పోషించాడు. 46 మ్యాచ్‌లలో 56 వికెట్లు తీసి ఈ ఫ్రాంచైజ్ తరఫున అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్ గా నిలిచాడు. 2023లో అతను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో తన తొలి ఐపీఎల్ హ్యాట్రిక్ సాధించాడు. అయితే, 2024 సీజన్ లో గొప్ప ప్రదర్శన రాలేదు. 36.70 సగటుతో కేవలం 10 వికెట్లు మాత్రమే తీసుకున్నాడు.
T20 క్రికెట్లో రికార్డ్-బ్రేకర్ రషీద్ ఖాన్
ఈ ఏడాది ప్రారంభంలో రషీద్ ఖాన్ డ్వేన్ బ్రావోను అధిగమించి T20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా నిలిచాడు. అతనికి 463 మ్యాచ్‌లలో 635 కి పైగా వికెట్లు, 4 సార్లు ఐదు వికెట్లు సాధించాడు.