DC Vs SRH: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ! స్టార్క్ దెబ్బ అదుర్స్ !

Published : Mar 30, 2025, 04:16 PM IST

IPL 2025 DC Vs SRH: ఢిల్లీ క్యాపిటల్స్ (DC)తో జ‌రుగుతున్న మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్  యంగ్ ప్లేయర్ అభిషేక్ శ‌ర్మ ఒక్క పరుగుకే ర‌నౌట్ అయ్యాడు.   

PREV
13
DC Vs SRH: స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాకిచ్చిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ ! స్టార్క్ దెబ్బ అదుర్స్ !

IPL 2025 DC Vs SRH: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 10 మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC)- సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) త‌ల‌ప‌డుతున్నాయి. విశాఖపట్నంలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

అయితే, ఆరంభంలోనే స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ కు బిగ్ షాక్ త‌గిలింది. తొలి ఓవ‌ర్ లోనే అభిషేక్ శ‌ర్మ వికెట్ ను కోల్పోయింది. ఆ త‌ర్వాత 3వ ఓవ‌ర్ లో మ‌రో రెండు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది. 300 ప‌రుగులు టార్గెట్ అంటూ తొలుత బ్యాటింగ్ కు దిగిన ఎస్ఆర్హెచ్ కు మంచి ఆరంభం ల‌భించ‌లేదు. 

23

ఓపెనింగ్ భాగస్వామ్యంలో ట్రావిస్ హెడ్‌తో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే, దురదృష్టవశాత్తు అభిషేక్ శర్మ మొదటి ఓవర్‌లోనే రనౌట్ అయ్యాడు. మిచెల్ స్టార్క్ వేసిన మొదటి ఓవర్‌లోని ఐదవ బంతికి సింగిల్ ప్రయత్నించేటప్పుడు ఇద్ద‌రు ప్లేయ‌ర్ల మ‌ధ్య‌ గందరగోళం కార‌ణంగా అభిషేక్ ర‌నౌట్ అయ్యాడు. విప్రజ్ నిగమ్ డైరెక్ట్ హిట్‌తో అభిషేక్ శ‌ర్మ పెవిలియ‌న్ కు చేరాడు. 

అభిషేక్ శ‌ర్మ కేవ‌లం 1 ప‌రుగు మాత్ర‌మే  చేసి అవుట్ అయ్యాడు. మొదటి ఓవర్ తర్వాత SRH స్కోరు 11/1 ఉంది. అభిషేక్ అవుట్ అయిన తర్వాత ఇషాన్ కిషన్ 3వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చాడు. మూడో ఓవ‌ర్ లో మ‌రోసారి అద్భుత‌మైన బౌలింగ్ తో మిచెల్ స్టార్క్ రెండు వికెట్లు తీసుకుని స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బిగ్ షాక్ ఇచ్చాడు. 

33
Mitchell Starc

మిచెల్ స్టార్క్ వేసిన అద్భుత‌మైన బాల్ ను బిగ్ షాట్ అడ‌బోయిన ఇషాన్ కిషన్ ట్రిస్టన్ స్టబ్స్‌కు క్యాచ్ రూపంలో దొరికిపోయాడు. అత‌ను 5 బంతుల్లో 2 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అదే ఓవ‌ర్ లో క్రీజులోకి వ‌చ్చిన తెలుగు ప్లేయ‌ర్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువ సేపు క్రీజులో నిల‌వ‌లేక‌పోయాడు. వ‌రుస వికెట్లు కోల్పోయిన స‌మ‌యంలో మ‌రో బ్యాట్ షాట్ ఆడి నితీష్ కుమార్ రెడ్డి ఒక్క ప‌రుగు కూడా చేయ‌కుండానే పేవిలియ‌న్ కు చేరాడు. దీంతో 25 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. 

మంచి ఊపుమీద ఆడుతున్న ట్రావిస్ హెడ్ ను కూడా మిచెల్ స్టార్క్ అద్భుత‌మైన బాల్ తో త‌న మూడో ఓవ‌ర్ లో పెవిలియ‌న్ కు పంపాడు. 22 ప‌రుగుల వ‌ద్ద కేఎల్ రాహుల్ వికెట్ల వ‌ద్ద క్యాచ్ గా దొరికిపోయాడు. 12 బంతులు ఆడిన ట్రావిస్ హెడ్ 22 ప‌రుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు బాదాడు. దీంతో ప‌వ‌ర్ ప్లే ముగిసే స‌మ‌యానికి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ 4 వికెట్లు కోల్పోయి 58 ప‌రుగులు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories