Slowest ball in IPL history: అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 9వ మ్యాచ్ లో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో తెలుగు ప్లేయర్, ముంబై జట్టు నుంచి ఐపీఎల్ అరంగేట్రం చేసిన సత్యనారాయణ రాజు ఐపీఎల్ చరిత్రలో అత్యంత నెమ్మదిగా బంతిని విసిరి వార్తల్లో నిలిచాడు.
Gujarat Titans' Jos Buttler in action
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 25 ఏళ్ల పేసర్ గుజరాత్ ఇన్నింగ్స్‌లోని 13వ ఓవర్‌లో జోస్ బట్లర్ బ్యాటింగ్ చేస్తుండగా ఐపీఎల్ లో నెమ్మదైన బంతిని వేశాడు. అది జోస్ బట్లర్‌ను చేరుకోవడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం తీసుకుంది. బట్లర్ ఆగి మరి ఆ షాట్ ను ఆడాడు.
చాలా స్లోగా వచ్చిన ఆ డెలివరీని డీప్ స్క్వేర్ లెగ్ పై నుంచి బౌండరీ బాదాడు. ఆ డెలివరీ ఆడిన తర్వాత బట్లర్ నవ్వుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సత్యనారాయణ రాజు ఐపీఎల్ స్లోయెస్ట్ బాల్ వీడియో ఇక్కడ చూడండి
Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler
సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు సత్యనారాయణ రాజు డెలివరీని వెస్టిండీస్ గ్రేట్ డ్వేన్ బ్రావో వేసిన కొన్ని స్లో బాల్ లతో పోల్చారు. ఎందుకంటే చాలా సార్లు బ్రావో స్లో డెలివరీలతో స్టార్ ప్లేయర్లను పెవిలియన్ కు పంపాడు. కానీ, సత్యనారాయణ రాజు వేసిన బంతులతో అలాంటి మ్యాజిక్ జరగలేదు. రాజు తన 3 ఓవర్ల స్పెల్ లో 40 పరుగులు ఇచ్చాడు కానీ ముంబై ఇండియన్స్ తరపున చివరి ఓవర్ ను అద్భుతంగా వేశాడు.
రాజు స్లో బాల్ తో పాటు అతని ఐపీఎల్ తొలి వికెట్ తీసుకోవడం కూడా ఈ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది. రషీద్ ఖాన్ సిక్స్ కొట్టి జోష్ లో ఉన్న సమయంలో ఇన్నింగ్స్ చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చిన రాజు.. అతన్ని అవుట్ చేసి ఐపీఎల్ లో తన తొలి వికెట్ ను సాధించాడు.
Slowest ball in IPL history? Mumbai Indians Telugu pacer Satyanarayana Raju surprises Jos Buttler
చాలా మందిని ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో విఘ్నేష్ పుతూర్ అద్భుతంగా ఆడినప్పటికీ, కీలకమైన ఓవర్లలో రాజును నమ్మింది ముంబై ఇండియన్స్. ఈ సీజన్ లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన రాజు.. దేశవాళీ క్రికెట్ లో, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో అరంగేట్రం చేయడానికి ముందు అతను కేవలం 8 ఫస్ట్-క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.