IPL 2025: ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమి.. హార్దిక్ కు షాకిచ్చిన గిల్ సేన !
IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.
IPL 2025 GT vs MI: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొడుతూ శుభ్ మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ టైటాన్స్ ముంబై ఇండియన్స్ కు షాకిస్తూ ఐపీఎల్ 2025లో తొలి విజయాన్ని అందుకుంది.
IPL 2025 GT vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ వరుసగా రెండో ఓటమిని ఎదుర్కొంది. ఐపీఎల్ 2025 9వ మ్యాచ్ లో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ vs ముంబై ఇండియన్స్ తలపడ్డాయి.
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్‌కు మంచి ఆరంభం లభించలేదు. ఎందుకంటే ఆ టీమ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, ఇప్పుడు గుజరాత్ టైటాన్స్ చేతిలో కూడా ఓడిపోయింది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని గుజరాత్ జట్టు హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబై జట్టును 36 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ హార్దిక్ ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 196 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ముంబైపై గుజరాత్ కు ఇది వరుసగా రెండో విజయం. గత సంవత్సరం కూడా ఇదే మైదానంలో హార్దిక్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించింది. అహ్మదాబాద్‌లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇది వీరిద్దరి మధ్య జరిగిన నాల్గవ మ్యాచ్ కాగా, గుజరాత్ అన్ని మ్యాచ్‌లలో గెలిచింది.
సాయి సుదర్శన్ అర్ధ సెంచరీతో గుజరాత్ టైటాన్స్ మంచి స్కోర్ చేసింది. సుదర్శన్ 41 బంతుల్లో 63 పరుగుల తన ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, రెండు సిక్సర్లు బాదాడు. అతనితో పాటు కెప్టెన్ శుభమాన్ గిల్ 38 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 39 పరుగుల వేగవంతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై తరఫున హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టాడు. ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహమాన్, సత్యనారాయణ రాజు ఒక్కొక్కరు ఒక్కో వికెట్ తీసుకున్నారు.
భారీ టార్గెట్ చేధించే క్రమంలో ముంబై జట్టుకు ఎక్కడా కూడా మంచి టర్న్ లభించలేదు. ఆరంభంలోనే రోహిత్ వికెట్ ను కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోయింది. రన్ రేటు పెరుగుతుండటంతో జట్టుపై ఒత్తిడి పెరిగింది.
తిలక్ వర్మ 39 పరుగులు, సూర్య కుమార్ యాదవ్ 48 పరుగుల ఇన్నింగ్స్ లతో ముంబై ఇండియన్స్ 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 2, ప్రసిద్ధ్ క్రిష్ణ 2 వికెట్లు తీసుకున్నారు.