IPL 2025 Shubman Gill fined: గుజరాత్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ కు బిగ్ షాక్ తగిలింది. శనివారం అహ్మదాబాద్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 35వ మ్యాచ్‌లో తన జట్టు స్లో ఓవర్ రేటును కలిగి ఉన్నట్లు గుర్తించిన తర్వాత, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు జరిమానా విధించినట్లు సమాచారం.
ఈ సీజన్‌లో ఇప్పటివరకు, స్లో ఓవర్ రేటు ఉల్లంఘనల కారణంగా గిల్ తో పాటు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్, లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్, రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్, ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కు కూడా జరిమానా విధించారు.
Shubman Gill
జోస్ బట్లర్ అద్భుతమైన ఇన్నింగ్స్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌తో కలిసి సెంచరీ భాగస్వామ్యంతో శనివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన హైస్కోరింగ్ పోరులో గుజరాత్ టైటాన్స్ (జీటీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
డీసీ బ్యాటర్లు కేఎల్ రాహుల్, అభిషేక్ పొరెల్ నుంచి మెరుపు ఆరంభం, ఆ తర్వాత చివర్లో ఆశుతోష్ శర్మ ఇన్నింగ్స్ తో జీటీ పై ఢిల్లీ 203/8 పరుగులు చేసింది.
Gujarat Titans skipper Shubman Gill (Photo: IPL)
గుజరాత్ 204 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. బట్లర్ 54 బంతుల్లో 97* పరుగుల సునామీ ఇన్నింగ్స్ తో పాటు షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ 40 పరుగులు, రాహుల్ తెవాటియా (11*) చివరి టచ్‌లతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
ఫామ్‌లో ఉన్న బట్లర్‌ను పెవిలియన్ కు పంపడానికి చాలా ప్రయత్నాలే చేసింది కానీ, విజయం సాధించలేదు. దీంతో ఢిల్లీ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.