IPL 2025 CSK vs MI: ఐపీఎల్ లో రోహిత్ శర్మ చెత్త రికార్డు
IPL 2025 CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు.
IPL 2025 CSK vs MI: చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ జీరో పరుగులకే అవుట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ కెరీర్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ ఐపీఎల్ లో చెత్త రికార్డును నమోదుచేశాడు. చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్టార్ బ్యాటర్ హిట్‌మ్యాన్ రోహిత్ నాలుగు బంతులు ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. ముంబై మాజీ కెప్టెన్ తన ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్ లో నిరాశపరిచాడు.
ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ మొదటి ఓవర్లోనే చెన్నై పేసర్ ఖలీల్ అహ్మద్ బౌలింగ్ లో మిడ్ వికెట్ వద్ద క్యాచ్ రూపంలో అవుట్ అయ్యాడు. ఇది రోహిత్ కు ఐపీఎల్ కెరీర్‌లో 18వ డకౌట్. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్ గా చెత్త రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ లో అత్యధిక డకౌట్ లు అయిన గ్లెన్ మాక్స్వెల్, దినేష్ కార్తీక్‌ల రికార్డులను సమం చేశాడు.
IPL లో అత్యధికంగా డకౌట్ ప్లేయర్లు:
18 - రోహిత్ శర్మ*
18 - గ్లెన్ మాక్స్వెల్
18 - దినేష్ కార్తీక్
16 - పియూష్ చావ్లా
16 - సునీల్ నరైన్
ఐపీఎల్ లో రోహిత్ శర్మ రికార్డు:
రోహిత్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో చరిత్రలో అత్యంత విజయవంతమైన ప్లేయర్, అలాగే కెప్టెన్ కూడా. రోహిత్ శర్మ ఐపీఎల్ లో 258 మ్యాచులు ఆడాడు. 6628 పరుగులు సాధించాడు. రెండు సెంచరీలు, 43 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ లో రోహిత్ శర్మ అత్యధిక స్కోరు 109 పరుగులు (నాట్ అవుట్) - 2012 సీజన్‌లో కోలకతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో సాధించాడు.
రోహిత్ శర్మ IPL చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ముంబై ఇండియన్స్ కు 5 ఐపీఎల్ టైటిళ్లను (2013, 2015, 2017, 2019, 2020) అందించాడు.