IPL 2025 SRH vs RR: రాజస్థాన్ పై హైదరాబాద్ వైల్డ్ ఫైర్.. ఐపీఎల్ లో రెండో అత్యధిక టీమ్ స్కోర్

Published : Mar 23, 2025, 06:36 PM IST

IPL 2025 SRH vs RR: హైద‌రాబాద్ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిష‌న్ త‌న బ్యాట్ తో దుమ్మురేపాడు. త‌న ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచ‌రీతో హైద‌రాబాద్ టీమ్ మ‌రోసారి భారీ స్కోర్ సాధించింది.  

PREV
14
IPL 2025 SRH vs RR: రాజస్థాన్ పై హైదరాబాద్ వైల్డ్ ఫైర్..  ఐపీఎల్ లో రెండో అత్యధిక టీమ్ స్కోర్

 IPL 2025 SRH vs RR: సునామీ, విధ్వంసం, వైల్డ్ ఫైర్ ఇవ‌న్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ లో క‌నిపించాయి. హైద‌రాబాద్ బ్యాట‌ర్లు వ‌చ్చిన వారు వ‌చ్చిన‌ట్టుగా ధ‌నాధ‌న్ బ్యాటింగ్ తో ప‌రుగుల వ‌ర్షం కురిపించారు. దీంతో మ‌రోసారి హైద‌రాబాద్ టీమ్ భారీ స్కోర్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండవ అత్యధిక స్కోరును నమోదు చేసింది.

ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ - రాజస్థాన్ రాయల్స్‌తో రెండో మ్యాచ్‌లో తలపడుతోంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తాత్కాలిక కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి, ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. 

24
IPL 2025

దీంతో మొద‌ట బ్యాటింగ్ కు దిగిన హైదరాబాద్ టీమ్ ఉప్ప‌ల్ స్టేడియంలో ప‌రుగుల వ‌ర్షం కురిపించింది. గత సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన సన్‌రైజర్స్ ఐపీఎల్ 2025 త‌న తొలి మ్యాచ్ తోనే ఈ సీజ‌న్ లో తాము ఎలాంటి ఆట‌ను ఆడ‌బోతున్నామ‌నేది స్ప‌ష్టం చేసింది. మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడుతూ రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌ను దంచికొట్టారు. ఆపండిరా బాబోయ్ అనేలా ఆర్ఆర్ బౌల‌ర్ల ప‌రిస్థితి క‌నిపించింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసి, రాజస్థాన్ రాయల్స్‌కు 287 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇషాన్ కిషన్ హైద‌రాబాద్ త‌ర‌ఫున తొలి మ్యాచ్ ను ఆడుతూ దుమ్మురేపే బ్యాటింగ్ తో సెంచ‌రీ కొట్టాడు. 106 పరుగులతో అజేయ సెంచరీ ఇన్నింగ్స్ ను ఆడాడు. 

 

34

ఇషాన్ కిషన్ 47 బంతుల్లో 106 పరుగుల ఇన్నింగ్స్ లో  11 ఫోర్లు, 6 సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. ఇషాన్ కిష‌న్ తో పాటు ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ మ‌రోసారి ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు త‌ల‌నొప్పి అని నిరూపించాడు. అద్భుతమైన బ్యాటింగ్ తో ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబట్టాడు. 31 బంతుల్లో 67 పరుగులు ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.

ఆ తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ 14 బంతుల్లో 34 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్ ను ఆడాడు. నితీష్ కుమార్ రెడ్డి 15 బంతుల్లో 30, అభిషేక్ శర్మ 11 బంతుల్లో 24 పరుగులు చేయడంతో హైదరాబాద్ టీమ్ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 286 పరుగులు చేసింది. 

రాజస్థాన్ బౌలింగ్ చెత్త రికార్డు 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు ఈ మ్యాచ్‌లో చెత్త బౌలింగ్ చేశారు. చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 76 పరుగులు ఇచ్చాడు. మహేష్ తీక్షణ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఫజల్‌హాక్ ఫరూఖీ 3 ఓవర్లలో 49, సందీప్ శర్మ 4 ఓవర్లలో 51, తుషార్ దేశ్‌పాండే 4 ఓవర్లలో 44 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

44

హైదరాబాద్ టీమ్ రికార్డులు ఇవే 

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఐపీఎల్ చరిత్రలో రెండవ అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. 

ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టీమ్ స్కోర్లు

1. SRH - 287/3 vs RCB (2024)
2. SRH - 286/6 vs RR (2025)
3. SRH - 277/3 vs MI (2024)
4. KKR - 272/7 vs DC (2024)
5. SRH - 266/7 vs DC (2024)

రికార్డ్-బ్రేకింగ్ టోటల్స్

SRH ఐపీఎల్ చరిత్రలో నాలుగు సార్లు 250 పైగా స్కోరు చేసిన తొలి జట్టు గా రికార్డ్ సృష్టించింది. 

ఇషాన్ కిషన్ సెంచరీ: 

ఇషాన్ కిషన్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన సెంచరీ కొట్టాడు. త‌న కెరీర్ లో తొలి ఐపీఎల్ సెంచ‌రీ. అలాగే, ఎస్ఆర్హెచ్ త‌ర‌ఫున అత‌నికి ఇది తొలి మ్యాచ్. 


జోఫ్రా ఆర్చర్ చెత్త బౌలింగ్ 

రాజస్థాన్ రాయల్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఈ మ్యాచ్‌లో అత్యంత ఖరీదైన బౌలింగ్  చేశాడు. ఐపీఎల్ చరిత్రలో చెత్త బౌలింగ్ ఫిగ‌ర్స్ గా నిలిచాయి. త‌న 4 ఓవ‌ర్ల బౌలింగ్ లో 76 ప‌రుగులు ఇచ్చాడు. 

హెన్రిచ్ క్లాసెన్ మ‌రో మైల్‌స్టోన్

హెన్రిచ్ క్లాసెన్ ఐపీఎల్‌లో 1000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైన 1000 ప‌రుగుల రికార్డు.
 

Read more Photos on
click me!

Recommended Stories