IPL 2025 SRH vs RR: ఇదేం కొట్టుడు సామి.. ట్రావిస్ హెడ్ విధ్వంసం

Published : Mar 23, 2025, 04:40 PM ISTUpdated : Mar 23, 2025, 04:47 PM IST

IPL 2025 SRH vs RR: రాజస్థాన్ రాయల్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడు మొద‌లుపెట్టింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఊహించిన విధంగానే బ్యాటింగ్ తో దుమ్మురేపారు. దీంతో హైదరాబాద్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.  

PREV
13
IPL 2025 SRH vs RR: ఇదేం కొట్టుడు సామి.. ట్రావిస్ హెడ్ విధ్వంసం

IPL 2025 SRH vs RR Live Updates: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తమ ఐపీఎల్ 2025 ఓపెనర్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR)తో త‌ల‌ప‌డుతోంది. బ‌ల‌మైన బ్యాటింగ్ లైనప్, సీనియ‌ర్ స్టార్ బౌలర్ల‌తో హైద‌రాబాద్ టీమ్ ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ద‌డ‌పుట్టిస్తోంది. ట్రావిస్ హెడ్ విధ్వంసం కొనసాగుతోంది. ఫోర్లు సిక్సర్లతో విరుచుకుపడుతూ ట్రావిస్ హెడ్ కేవలం 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్ లో హెడ్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. 

రాజస్థాన్ రాయల్స్ జట్టు కెప్టెన్ సంజు శాంసన్ వేలు గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో రియాన్ పరాగ్ తాత్కాలిక కెప్టెన్‌గా జ‌ట్టును ముందుకు న‌డిపిస్తున్నాడు. టాస్ గెలిచిన రాజస్థాన్ టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ప్యాట్ కమ్మిన్స్ కెప్టెన్సీలోని హైదరాబాద్ టీమ్ మొదట బ్యాటింగ్ కు దిగింది. 

23
IPL, SRH, Travis Head , Abhishek Sharma

సన్‌రైజర్స్ హైదరాబాద్ కు మంచి ఆరంభం లభించింది. ఎస్ఆర్హెచ్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ లు దూకుడుగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించారు. మ‌రీ ముఖ్యంగా ట్రావిస్ హెడ్ సునామీ బ్యాటింగ్ లో చెల‌రేగుతున్నాడు. దీంతో ఆర్ఆర్ బౌల‌ర్ల‌కు ఏం చేయాలో అర్థంకాని ప‌రిస్థితిలో క‌నిపించారు. గ్రౌండ్ న‌లుమూల‌ల అద్భుత‌మైన షాట్స్ ఆడుతూ హెడ్ దుమ్మురేపాడు. 

ట్రావిస్ హెడ్ కేవ‌లం 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేశాడు. త‌న హాఫ్ సెంచ‌రీ ఇన్నింగ్స్ లో హెడ్ 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు.  అత‌నికి తోడుగా యంగ్ ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ కూడా క్రీజులో ఉన్నంత సేపు సూప‌ర్ బ్యాటింగ్ తో అల‌రించాడు. అభిషేక్ శ‌ర్మ 11 బంతుల్లో 24 ప‌రుగులు ఇన్నింగ్స్ ను ఆడాడు. తీక్ష‌ణ బౌలింగ్ లో య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత‌మైన క్యాచ్ అందుకుని అభిషేక్ శ‌ర్మ‌ను ఔట్ చేశాడు. అభిషేక్ శ‌ర్మ 24(11) ప‌రుగుల ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు బాదాడు.

 

33
Travis Head

అప్ప‌టికే హైద‌రాబాద్ టీమ్ 45/1 (3.1 ఓవ‌ర్లు) ప‌రుగులు చేసింది. ట్రావిస్ దెబ్బతో హైద‌రాబాద్ టీమ్ 5 ఓవ‌ర్లు ముగిసే స‌రికి: 78/1 (5 ఓవ‌ర్లు) ప‌రుగులు చేయ‌గా, 10 ఓవ‌ర్ల కాక‌ముందే 100 ప‌రుగులు పూర్తి చేసింది. 10 ఓవ‌ర్లు ముగిసే స‌రికి హైద‌రాబాద్ టీమ్ 1 వికెట్ కోల్పోయి 126 ప‌రుగులు చేసింది. ఓవర్ ది టాప్ లో బిగ్ షాట్ ఆడబోయి క్యాచ్ రూపంలో ట్రావిస్ హెడ్ 67 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. తుషార్ దేశ్ పాండే బౌలింగ్ లో హిట్మేయర్ క్యాచ్ అందుకున్నాడు. 

12 ఓవర్లు పూర్తయ్యే సరికి హైదరాబాద్ టీమ్  156-2 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్ లో ఇషాన్ కిషన్ అద్భుతమైన సిక్సర్లతో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. నితీష్ కుమార్ 18 పరుగులతో ఆడుతున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories