IPL 2026: ఢిల్లీకి సంజూ.. కేకేఆర్‌కు రాహుల్.. మెగా వేలంలోకి స్టార్ ప్లేయర్లు.. ఎవరెవరంటే.?

Published : Oct 17, 2025, 09:53 AM IST

IPL 2026: ఐపీఎల్ 2026 ట్రేడ్ విండోలో సంజూ శాంసన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. అతడిపై ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేసినట్టు తెలుస్తోంది. డీసీ సంజూను కెప్టెన్‌గా, ఓపెనర్‌గా బరిలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. 

PREV
15
జోరుగా ప్లేయర్ ట్రేడ్‌లు

ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ప్లేయర్ ట్రేడ్‌లు, రిటైన్ లిస్టుపై ఫ్రాంచైజీల నడుమ తీవ్ర చర్చలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలు కీలక విషయాలు బయటకొచ్చాయి. అందులో ఒకటి సంజూ శాంసన్ ఎగ్జిట్. రాజస్థాన్ రాయల్స్(ఆర్‌ఆర్‌) కెప్టెన్ సంజూ శాంసన్ తన జట్టును వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక అతడిపై ఢిల్లీ క్యాపిటల్స్ కన్నేసింది. సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ వదిలి వెళ్లాలని అనుకుంటున్నట్టు సమాచారం. మొదట్లో రాహుల్ ద్రావిడ్‌తో విభేదాల కారణంగా ఈ వార్తలు వచ్చినా, అవి అవాస్తవమని తేలింది. రాహుల్ ద్రావిడ్ ఆర్‌ఆర్‌ను వీడి వెళ్లిన తర్వాత కూడా శాంసన్ జట్టుతో కొనసాగడానికి సుముఖంగా లేడు.

25
టీమ్ మేనేజ్‌మెంట్‌తో విబేధాలు

అతనికి, టీమ్ మేనేజ్‌మెంట్‌కి మధ్య విబేధాలే ఇందుకు కారణం అని తెలుస్తోంది. ఐపీఎల్ 2025కు ముందు జోస్ బట్లర్‌ను రిటైన్ చేసుకోవాలని సంజూ శాంసన్ గట్టిగా కోరాడట. అయితే, యాజమాన్యం అతని మాట వినకుండా హెట్మైర్‌ను ఉంచుకుంది. బట్లర్ వేరే జట్టు తరఫున అద్భుతంగా రాణించగా.. హెట్మైర్ విఫలమయ్యాడు. ఇది సంజూను తీవ్ర నిరాశకు గురి చేసింది. అంతేకాదు గాయం కారణంగా సంజూ అందుబాటులో లేకపోయేసరికి.. కెప్టెన్‌గా యశస్వి జైస్వాల్‌కు కాకుండా రియాన్ పరాగ్‌కు అవకాశం ఇచ్చారు. అది కూడా శాంసన్‌కు నచ్చలేదు.

35
సంజూ శాంసన్‌ కోసం సీఎస్‌కే ప్రయత్నం

గతంలో, చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) సంజూ శాంసన్‌ కోసం ప్రయత్నించింది. ఆర్‌ఆర్‌ మూడు కీలక ఆటగాళ్లను రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబేలను – సంజూను ట్రేడ్‌లో భాగంగా అడిగింది. అయితే, సీఎస్‌కే ఈ ముగ్గురిని ట్రేడ్ చేయడానికి నిరాకరించడంతో ఆ డీల్ కాస్తా క్యాన్సిల్ అయింది. ఇప్పుడు, ఢిల్లీ క్యాపిటల్స్ సంజు శాంసన్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డీసీ సంజూను కెప్టెన్‌గా, ఓపెనర్‌గా, వికెట్ కీపర్‌గా వాడుకోవాలని చూస్తోంది. ప్రస్తుత డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ కెప్టెన్సీతో యాజమాన్యం సంతృప్తిగా లేదని తెలుస్తోంది. ఫాఫ్ డుప్లెసిస్ వంటి విదేశీ ఓపెనర్ రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉండటంతో.. సంజూ శాంసన్ రాక డీసీకి అదనపు ప్రయోజనం చేకూరనుంది.

45
అందుకు డీసీ నో

ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంజూ శాంసన్‌ను ఇవ్వాలంటే.. రాజస్థాన్ రాయల్స్ కేఎల్ రాహుల్‌ను అడుగుతోందట. 'లైక్-ఫర్-లైక్' డీల్ ప్రకారం ఇది ఇద్దరు భారత వికెట్ కీపర్ల మధ్య జరగనుంది. ఆర్‌ఆర్‌ యువ బ్యాట్స్‌మెన్‌లతో నిండి ఉంది. వారికి కేఎల్ రాహుల్ లాంటి అనుభవజ్ఞుడైన క్లాస్ ప్లేయర్ చాలా అవసరం. రాహుల్ ఒక ఎండ్‌లో నిలదొక్కుకుని ఆడగలడు. ఇది యువ ఆటగాళ్లకు దూకుడుగా ఆడే స్వేచ్ఛను ఇస్తుంది. కేకేఆర్ కూడా కేఎల్ రాహుల్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ, వెంకటేష్ అయ్యర్‌ను ట్రేడ్ చేయాలని చూడగా.. అందుకు డీసీ నో అని చెప్పింది.

55
వీరు జట్టు నుంచి బయటకు..

ఇతర జట్టు అప్‌డేట్‌లను పరిశీలిస్తే.. సీఎస్‌కే దీపక్ చాహర్, విజయ్ శంకర్, రాహుల్ త్రిపాఠి, శామ్ కరణ్, డెవాన్ కాన్వే వంటి ఆటగాళ్లను రిలీజ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఆర్‌. అశ్విన్ రిటైర్మెంట్‌తో వారికి పెద్దగా పర్స్ ఖాళీ అయింది. శామ్ కరణ్, డెవాన్ కాన్వేలను వదులుకోవడంపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ మిచెల్ స్టార్క్, టి. నటరాజన్‌లను రిలీజ్ చేసే అవకాశం ఉంది. లక్నో సూపర్ జెయింట్స్ మయాంక్ యాదవ్, ఆకాశ్ దీప్, డేవిడ్ మిల్లర్‌లను వదులుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories