Published : May 29, 2026, 10:29 PM ISTUpdated : May 29, 2026, 10:42 PM IST
indian Premier League 2026 : ఐపిఎల్ నే షేక్ చేసే ఇన్నింగ్స్ లు ఆడుతున్నాడు రాజస్థాన్ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. తాజాగా కీలక ప్లేఆఫ్ మ్యాచ్ లో మరోసారి దుమ్మురేపిన అతడు మరిన్ని రికార్డులు బద్దలుగొట్టాడు. అవేంటో చూద్దాం.
IPL 2026 : ఐపీఎల్ 2026 క్వాలిఫయర్ 2 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఫైనల్ బెర్తును ఖాయం చేసుకునేందుకు గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) హోరాహోరీగా పోరాడుతున్నాయి. మొదట మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 214 పరుగులు చేసింది... 215 పరుగుల విజయలక్ష్యంతో గుజరాత్ బరిలోకి దిగింది.
ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారన్నది పక్కనబెడితే రాజస్థాన్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి అదగొట్టాడు. ఓవైపు వరుసగా వికెట్లు పడుతుండటంతో తన స్టైల్ కు భిన్నంగా సమయోచితంగా ఆడాడు... 47 బంతుల్లో 96 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ తో మ్యాచ్ లో (97 పరుగులు) మాదిరిగానే ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ మిస్సయ్యాడు. అయితేనేం జట్టుకు విలువైన పరుగులు అందించాడు.. ఎన్నో రికార్డులు బద్దలుగొట్టాడు.
25
ఒకే సీజన్లో 700+ పరుగులు..
గుజరాత్ బౌలర్లను ఊచకోత కోస్తూ వైభవ్ బ్యాటింగ్ సాగింది... ఈ క్రమంలో అతడు ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో 700 పైగా పరుగులు చేసిప తొలి అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా (అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడని ఆటగాడు) చరిత్ర సృష్టించాడు. అంటే భారత జట్టుకు ఆడకుండానే ఐపీఎల్‌లో 700 పరుగులు చేసిన మొదటి ఆటగాడు వైభవ్.
గతంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్లుగా యశస్వి జైస్వాల్ (2023లో 625 పరుగులు), షాన్ మార్ష్ (2008లో 616 పరుగులు) పేరిట ఉన్న రికార్డులను వైభవ్ బద్దలు కొట్టాడు. అంతేకాదు ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సులు కొట్టిన క్రిస్ గేల్ (2012లో 59 సిక్సులు) 14 ఏళ్ల రికార్డును ఈ 15 ఏళ్ల కుర్రాడు చెరిపేశాడు. అలాగే 2016లో డేవిడ్ వార్నర్ పవర్‌ప్లేలో చేసిన 467 పరుగుల రికార్డును కూడా దాటేశాడు. ఈ సీజన్‌లో వైభవ్ పవర్‌ప్లే ఓవర్లలోనే 500కు పైగా పరుగులు సాధించాడు.
35
ఫాస్టెస్ట్ 1000 పరుగులు...
ఐపిఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ 1000 పరుగుల రికార్డు వైభవ్ సూర్యవంశీ పేరిట నమోదయ్యింది. అతడు కేవలం 400 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించాడు. ఇక 545 బంతుల్లో ఆండ్రీ రస్సెల్, 560 బంతుల్లో టిమ్ డేవిడ్, 575 బంతుల్లో ట్రావిస్ హెడ్, 575 బంతుల్లో పిలిప్ సాల్ట్, 594 బంతుల్లో క్లాసేన్ 1000 పరుగులు పూర్తిచేసుకున్నారు. భారత ఆటగాళ్లలో వీరేంద్ర సెహ్వాగ్ ఐపిఎల్ లో ఫాస్టెస్ట్ 1000 పరుగులు (604 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు.. అతడి రికార్డును కూడా బద్దలుగొట్టాడు వైభవ్.
అతి తక్కువ ఇన్నింగ్సుల్లో 1000 పరుగులు పూర్తిచేసుకున్న ఆటగాడిగా వైభవ్ నిలిచాడు. అతడు కేవలం 23 ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించాడు... అయితే అతడికంటే తక్కువ మ్యాచుల్లో (21) షాన్ మార్ష్ ఈ ఘనత సాధించాడు. సిమన్స్ కూడా వైభవ్ తో సమానంగా 23 మ్యాచుల్లో 1000 పరుగులు చేశాడు. ఇక కాన్వే 24, హెడెన్ 25, సాయి సుదర్శన్ 25 ఇన్నింగ్సుల్లో ఈ ఘనత సాధించారు.
55
90+ రన్స్ లో అత్యధిక ఔట్స్...
ఒకే ఐపిఎల్ సీజన్లో ఎక్కువసార్లు 90+ స్కోరు వద్ద అంటే సెంచరీకి చేరువలో ఔటైన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ నిలిచాడు. ఈ సీజన్లో మూడుసార్లు ఇలా వైభవ్ సెంచరీ మిస్సయ్యాడు... 2014 మ్యాక్స్ వెల్ కూడా ఇలాగే 3 సెంచరీ మిస్సయ్యాడు. ఈ సీజన్లోనే మిచెల్ మార్ష్ కూడా 2 సార్లు 90+ పరుగులు పూర్తిచేసి.. సెంచరీ చేయకుండానే ఔటయ్యాడు.
వెంటవెంటనే సెంచరీ ఛాన్స్ మిస్సవడంతో వైభవ్ డిజప్పాయింట్ అయ్యాడు… ఔటైన తర్వాత అతడి రియాక్షన్ చూస్తేనే ఇది అర్థమవుతుంది. కానీ ఈ ఇన్నింగ్స్ లు అభిమానుల మనసులు గెలుచుకున్నాయి.. ఇంత చిన్న వయసులో పరిణతితో కూడిన అతడి ఆటకు ఫిదా అయ్యామంటున్నారు అభిమానులు.