IPL 2026 Orange Cap Winner: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. అత్యంత పిన్న వయసులోనే ఆరెంజ్ క్యాప్ !

Published : May 31, 2026, 10:02 PM IST

IPL 2026 Orange Cap Winner: ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ సంచలనం వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. అలాగే, మోస్ట్ సిక్సర్స్ అవార్డులను గెలుచుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

PREV
16
రేయ్ ఎవడ్రా వీడు 15 ఏళ్లకే ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ కొట్టేసాడు.. వైభవ్ సూర్యవంశీ ఊచకోత

ఐపీఎల్ 2026 సీజన్ భారీ స్కోర్లు, రికార్డుల మోతతో క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలోనే కేవలం 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టేలా చేస్తూ, అత్యంత పిన్న వయసులోనే  ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.

మార్చి 27, 2011న బీహార్‌లోని తాజ్‌పూర్‌లో జన్మించిన వైభవ్ సూర్యవంశీ.. చిన్ని వయస్సులోనే ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. దుమ్మురేపే బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లోనూ పరుగుల వరద పారించాడు. కేవలం 15 ఏళ్ల 65 రోజుల వయసులోనే ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు. 

ఈ సీజన్‌లో కేవలం 16 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 237.30 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లోనే వైభవ్ సెంచరీ మార్క్‌ను అందుకోవడం విశేషం.

26
గిల్, సుదర్శన్ రేస్ నుండి అవుట్

ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ త్వరగా అవుట్ కావడంతో వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలవడం ఖాయమైంది. ఫైనల్ మ్యాచ్ ప్రారంభానికి ముందు గిల్ 722 పరుగులతో, సుదర్శన్ 710 పరుగులతో వైభవ్ రికార్డును అధిగమించే రేసులో ఉన్నారు. అయితే ఆర్సీబీతో జరిగిన ఫైనల్లో గుజరాత్ కెప్టెన్ గిల్ కేవలం 10 పరుగులకే అవుట్ కాగా, సుదర్శన్ 12 పరుగులకే వెనుదిరిగాడు. దీనితో సుదర్శన్ 722 పరుగులతో రెండో స్థానంలో, గిల్ మూడో స్థానంలో నిలిచారు.

మరోవైపు 600 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ గెలవాలంటే ఫైనల్లో 176 కంటే ఎక్కువ పరుగులు చేయాల్సి ఉంది, అది ప్రస్తుతానికి దాదాపు అసాధ్యం. వైభవ్ సూర్యవంశీ ఈ సీజన్‌లో 48.5 సగటుతో, 237.3 స్ట్రైక్ రేట్‌తో 776 పరుగులు చేసి టాప్ లో నిలిచాడు.

36
ఎలిమినేటర్, క్వాలిఫైయర్ లలో వైభవ్ ఊచకోత

ఈ లీగ్‌లో వైభవ్ సూర్యవంశీ ప్రయాణం నిజంగా ఒక సంచలనం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 పరుగులు, గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో 96 పరుగులు చేసి అందరికంటే వేగంగా దూసుకెళ్లాడు. ఆ తర్వాత క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్‌ను ఓడించి గుజరాత్ ఫైనల్‌కు చేరినప్పటికీ, గిల్, సుదర్శన్ ఫైనల్లో వైభవ్ పరుగులను దాటలేకపోయారు.

46
క్రిస్ గేల్ రికార్డ్ బద్దల్.. నయా సిక్సర్ల కింగ్ వైభవ్ సూర్యవంశీ

వైభవ్ కేవలం పరుగులు మాత్రమే చేయలేదు, గ్రౌండ్‌లో సిక్సర్ల సునామీ సృష్టించాడు. ఈ సీజన్‌లో ఏకంగా 72 సిక్సర్లు బాదాడు. దీనితో ఒకే ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్ పాత రికార్డును బద్దలు కొట్టి, 'మోస్ట్ సిక్సెస్' అవార్డును కూడా తన అకౌంట్‌లో వేసుకున్నాడు.

పవర్‌ప్లే ఓవర్లలోనే వైభవ్ ఆట వేరే లెవెల్‌లో ఉంది. మొదటి ఆరు ఓవర్లలోనే 500 కంటే ఎక్కువ పరుగులు చేసి ఓపెనింగ్ స్ట్రాటజీని పూర్తిగా మార్చేశాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తూ పవర్‌ప్లేలో అత్యంత ప్రమాదకరమైన బ్యాటర్‌గా మారాడు.

56
సంచలన రికార్డుల వైభవం

ఈ సీజన్‌లో వైభవ్ సూర్యవంశీ ఎన్నో రికార్డులను తిరగరాశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అలాగే ఏదైనా టీ20 టోర్నమెంట్‌లో కేవలం పవర్‌ప్లేలోనే 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన మొదటి ప్లేయర్‌గా ఘనత సాధించాడు. గత సీజన్‌లో 23 ఏళ్ల 237 రోజుల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన సాయి సుదర్శన్ రికార్డును వైభవ్ బద్దలు కొట్టాడు.

ఐపీఎల్ లో అత్యంత పిన్న వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచిన టాప్-5 ప్లేయర్లు

  1. వైభవ్ సూర్యవంశీ - 15 సంవత్సరాల 65 రోజులు
  2. సాయి సుదర్శన్ - 23 సంవత్సరాల 237 రోజులు
  3. శుభ్‌మన్ గిల్ - 23 సంవత్సరాల 263 రోజులు
  4. రుతురాజ్ గైక్వాడ్ - 24 సంవత్సరాల 257 రోజులు
  5. షాన్ మార్ష్ - 24 సంవత్సరాల 328 రోజులు
66
12 ఏళ్లకే రంజీ.. 15 ఏళ్లకే ఐపీఎల్ స్టార్

వైభవ్ సూర్యవంశీ క్రికెట్ జర్నీ చాలా తక్కువ టైమ్‌లోనే అద్భుత శిఖరాలను తాకింది. కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 13 ఏళ్ల వయసులో ఐపీఎల్ కాంట్రాక్ట్ దక్కించుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ ఇతన్ని ₹1.1 కోట్లకు కొనుగోలు చేసింది.

ఆ తర్వాత ఐపీఎల్ 2025 సీజన్‌లో 14 ఏళ్ల వయసులోనే మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యంత పిన్న వయసులో అరంగేట్రం చేయడమే కాకుండా సెంచరీ చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇప్పుడు 15 ఏళ్ల వయసులో ఆరెంజ్ క్యాప్ గెలిచి వరల్డ్ క్రికెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories