IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?

Published : May 30, 2026, 12:29 PM IST

IPL 2026 Orange Cap: ఐపీఎల్ 2026 ఆరెంజ్ క్యాప్ రేసు క్లైమాక్స్‌కు చేరింది. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ టాప్ లో ఉన్నాడు. వైభవ్ రికార్డును బ్రేక్ చేసేందుకు గిల్, సాయి సుదర్శన్ ఫైనల్‌కు రెడీ అయ్యారు. ముగ్గురు ప్లేయర్లు 700 పైగా రన్స్ చేయడం ఇదే మొదటిసారి.

PREV
14
టాప్ లేపిన ముగ్గురు బ్యాటర్లు.. ఐపీఎల్ 2026 లో 700 ప్లస్ రన్స్ కొట్టిన కింగ్స్ వీళ్లే

ఐపీఎల్ 2026 సీజన్ ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్‌లో టైటిల్ కోసం పోరు జరగనుంది. క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి గుజరాత్ టైటాన్స్ (GT) ఫైనల్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది.

మే 31న జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. ఈ బిగ్ ఫైట్‌కు ముందే ఐపీఎల్ హిస్టరీలో ఎప్పుడూ లేని ఒక మైండ్ బ్లోయింగ్ రికార్డ్ క్రియేట్ అయింది. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రలోనే ఇలాంటి రికార్డ్ ఎప్పుడూ చూడలేదు. దీంతో ఆరెంజ్ క్యాప్ రేస్ ఇప్పుడు పీక్స్‌కు చేరింది.

24
ఐపీఎల్ హిస్టరీలోనే ఫస్ట్ టైమ్

ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్‌లో ముగ్గురు వేర్వేరు బ్యాటర్లు 700 కంటే ఎక్కువ రన్స్ చేయడం ఇదే మొదటిసారి. ఈ హిస్టారికల్ రికార్డును రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ, గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, అతని ఓపెనింగ్ పార్ట్నర్ సాయి సుదర్శన్ కలిసి సెట్ చేశారు. గుజరాత్ టీమ్ ఫైనల్‌కు చేరడంతో ఆరెంజ్ క్యాప్ రేసు ఇంట్రెస్టింగ్‌గా మారింది.

34
నంబర్ 1 పొజిషన్‌లో వైభవ్ సూర్యవంశీ

క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయి టోర్నీ నుంచి బయటకు వచ్చేసింది. అయినా సరే ఆ టీమ్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ప్రెజెంట్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా టాప్‌లో ఉన్నాడు. వైభవ్ ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 16 ఇన్నింగ్స్ ఆడి 237.30 అనే నమ్మలేని స్ట్రైక్ రేట్‌తో టోటల్‌గా 776 రన్స్ చేశాడు. ఈ సీజన్‌లో అతని బ్యాట్ నుంచి రికార్డ్ స్థాయిలో 72 సిక్సర్లు, 63 ఫోర్లు వచ్చాయి.

44
గిల్, సుదర్శన్‌లకు గోల్డెన్ ఛాన్స్

రాజస్థాన్ రాయల్స్ టోర్నీ నుంచి అవుట్ కావడంతో వైభవ్ సూర్యవంశీ ఇకపై రన్స్ పెంచుకునే ఛాన్స్ లేదు. దీనివల్ల మే 31న జరిగే ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ ఇన్‌ఫామ్ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్‌లకు వైభవ్ నుంచి ఆరెంజ్ క్యాప్ లాగేసుకునే సూపర్ ఛాన్స్ దొరికింది.

శుభ్‌మన్ గిల్ 15 మ్యాచ్‌ల్లో 722 రన్స్‌తో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. అతను వైభవ్‌ను దాటాలంటే ఫైనల్‌లో 55 రన్స్ చేయాలి. అలాగే సాయి సుదర్శన్ 16 మ్యాచ్‌ల్లో 710 రన్స్‌తో థర్డ్ ప్లేస్‌లో ఉన్నాడు. అతను ఆరెంజ్ క్యాప్ కింగ్ అవ్వాలంటే ఫైనల్‌లో 67 రన్స్ స్కోర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఫైనల్‌లో గిల్, సుదర్శన్ ఇద్దరూ ఫెయిల్ అయితే, వైభవ్ సూర్యవంశీ తన రెండో ఐపీఎల్ సీజర్‌లోనే ఆరెంజ్ క్యాప్ గెలిచి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తాడు.

Read more Photos on
click me!

Recommended Stories