Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో

Published : May 30, 2026, 11:48 AM IST

Riyan Parag Vaibhav Suryavanshi: ఐపీఎల్ 2026 క్వాలిఫైయర్ 2లో వైభవ్ సూర్యవంశీ దుమ్మురేపాడు. కానీ 4 పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. అయితే, వైభవ్ అవుటైన తర్వాత రియాన్ పరాగ్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. అసలు ఏం జరిగింది?

PREV
14
వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ వైరల్ వీడియో.. ఏం జరిగింది?

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ (RR) ప్రయాణం ముగిసింది. క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి అవుట్ అయింది. కానీ ఈ సీజన్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మాత్రం తన అద్భుతమైన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఈ యువ బ్యాటర్ గురించే చర్చ నడుస్తోంది.

అయితే గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ సెంచరీకి చేరువలో (96 రన్స్) వద్ద అవుటయ్యాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడిన ఒక వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన క్రికెట్ లవర్స్ రియాన్ పరాగ్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. వైభవ్‌తో పరాగ్ ప్రవర్తించిన తీరు క్రికెట్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.

24
96 పరుగుల వద్ద వైభవ్ అవుట్

గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఈ కీలక మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ రాజస్థాన్ రాయల్స్‌కు ఊహించిన విధంగా స్టార్టింగ్ దక్కలేదు. టీమ్ భారీ ఆశలు పెట్టుకున్న మొదటి రెండు వికెట్లు చాలా త్వరగానే పడిపోయాయి. ఒక వైపు వికెట్లు పడుతున్నా, మరో ఎండ్‌లో వైభవ్ సూర్యవంశీ మాత్రం ఒంటరి పోరాటం చేశాడు.

ఎలిమినేటర్ మ్యాచ్‌లో 97 రన్స్ చేసి టీమ్‌ను గెలిపించిన వైభవ్, ఈ క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లో కూడా రెచ్చిపోయాడు. తన ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 96 రన్స్ చేసి అవుటయ్యాడు. సెంచరీ మిస్ అయిన బాధలో వైభవ్ పెవిలియన్‌కు చేరుకుంటుండగా, కెప్టెన్ రియాన్ పరాగ్ అతనితో మాట్లాడటం కనిపించింది.

34
నిరాశలో మునిగిపోయిన వైభవ్..

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో, రియాన్ పరాగ్ వైభవ్‌ వైపు వేలు చూపిస్తూ ఏదో సీరియస్‌గా చెప్తున్నాడు. మొదట పరాగ్ మాటలను వైభవ్ చాలా శ్రద్ధగా విన్నాడు. ఆ తర్వాత తీవ్రమైన నిరాశతో కూడిన రియాక్షన్ ఇచ్చాడు. ఈ సీన్ చూసిన అభిమానులు అంతా, రియాన్ పరాగ్ ఆ చిన్న పిల్లాడిని తిడుతున్నాడని సోషల్ మీడియాలో ఫిక్స్ అయిపోయారు.

అంతే, క్షణాల్లో ఈ క్లిప్ వైరల్‌గా మారింది. రియాన్ పరాగ్ చూపిస్తున్న ఈ యాటిట్యూడ్ నెటిజన్లకు అస్సలు నచ్చలేదు. దాంతో పరాగ్‌ను సోషల్ మీడియాలో ఫుల్లుగా ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ చిన్న పిల్లోడిని అలా తిట్టడం ఏంటంటూ నెటిజన్లు పరాగ్ క్లాస్ పీకుతున్నారు.

44
మ్యాచ్ తర్వాత పరాగ్ యూటర్న్

గ్రౌండ్‌లో సీరియస్‌గా కనిపించినా, మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం రియాన్ పరాగ్.. వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించాడు. అతని ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ.. “నేను దీన్ని మాటల్లో చెప్పలేను. సాధారణంగా అయితే బాగా కష్టపడి, గ్రౌండ్‌లోకి వెళ్లి రన్స్ చేయడమే అందరికీ తెలుసు. కానీ వైభవ్ బ్యాటింగ్ చేసిన విధానం కేవలం బంతిని బలంగా బాదడం మాత్రమే కాదు. అతను ఆలోచించకుండా బ్లైండ్‌గా షాట్లు ఆడడు. ఒకవేళ మొదటి బంతి నుంచే కేవలం కొట్టాలనే మైండ్‌సెట్‌తో ఉంటే, ఈరోజు తను చేసిన ఇన్నింగ్స్ ఆడలేకపోయేవాడు. అతను పరిస్థితులను అర్థం చేసుకుంటాడు, లెక్కలు వేసుకుంటాడు. నిజంగా అతను ప్రతిదీ చాలా బాగా ఆడతాడని” అన్నాడు. 

అలాగే,  "అసలు ఆ వయసులో అతను ఇవన్నీ ఎలా చేస్తున్నాడో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. కానీ అతను ఇలాగే ఆడాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశానికి మరిన్ని విజయాలు, గౌరవాన్ని తెచ్చిపెడతాడని ఆశిస్తున్నాను. అలాగే రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ మాకు రెండో ఛాంపియన్‌షిప్ అందిస్తాడని నమ్ముతున్నాను" అంటూ వైభవ్‌ను పరాగ్ ఆకాశానికెత్తేశాడు.

Read more Photos on
click me!

Recommended Stories