PBKS vs MI: ముంబైతో కీలక మ్యాచ్‌.. పంజాబ్ కు షాక్

Published : May 26, 2025, 06:17 PM IST

IPL 2025 PBKS vs MI: ముంబై ఇండియన్స్ తో జరిగే కీలక మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ స్టార్ ప్లేయర్లు చాహల్,  మార్కో జాన్సన్ ఆడటంపై స్పష్టత లేదు.

PREV
15
IPL 2025 PBKS vs MI: గెలిచిన జట్టుకు టాప్ ప్లేస్

IPL 2025 PBKS vs MI: ఐపీఎల్ 2025 లీగ్ దశ చివరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కీలక మ్యాచ్ ను ఆడనుంది. సోమవారం ముంబై ఇండియన్స్ తో జరగనున్న పోరులో ఆ జట్టు సీనియర్ స్టార్ లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే పంజాబ్ టాప్-2లో నిలిచే అవకాశాలు ఉంటాయి.

25
పంజాబ్ స్టార్ బౌలర్ చాహల్ కు గాయం

పంజాబ్ కింగ్స్ స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషీ ప్రకారం, ఢిల్లీ క్యాపిటల్స్‌తో జైపూర్‌లో జరిగిన గత మ్యాచ్‌లో చాహల్ గాయం కారణంగా ఆడలేదు. తాజా ESPNcricinfo రిపోర్ట్ ప్రకారం, చాహల్ కుడిచేతి మణికట్టు గాయం అయింది. ముంబైతో జరిగే మ్యాచ్ లో కూడా చాహల్ ఆడకపోవచ్చని పేర్కొంది. ఇప్పటికే ప్లేఆఫ్‌కి అర్హత పొందిన పంజాబ్ కింగ్స్, చాహల్‌ను కోలుకున్న తర్వాత ప్లేఆఫ్స్ మ్యాచ్ లలో ఆడించాలని చూస్తోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

35
చాహల్ స్థానంలో కర్నాటక లెగ్ స్పిన్నర్ ప్ర‌వీణ్ దుబే

చాహల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉంటాడని పంజాబ్ ఆశాభావం వ్యక్తం చేసింది. ఢిల్లీపై మ్యాచ్‌లో చాహల్ స్థానంలో కర్నాటక లెగ్ స్పిన్నర్ ప్ర‌వీణ్ దుబే ఐపీఎల్ మ్యాచ్‌ ఆడాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు వ్యతిరేకంగా పంజాబ్ తరఫున అతను అరంగేట్రం చేశాడు.

45
మార్కో జాన్సన్ పంజాబ్ ను వీడాడా?

చాహల్ తో పాటు పంజాబ్ బౌలింగ్ లైనప్‌కు మరో దెబ్బ తగిలే అవకాశం ఉంది. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ జట్టును విడిచిపెట్టినట్టు వీడియో ఒకటి పంజాబ్ కింగ్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో హెడ్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ,

“మా ఆటగాళ్లలో ఒకరు రేపు మమ్మల్ని విడిచిపోతున్నారు. మార్కో జాన్సన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం బయలుదేరుతున్నాడు. ఇప్పటివరకు మా విజయాల్లో అతను ప్రధాన పాత్ర వహించాడు. మేము మిమ్మల్ని మిస్సవుతాము,” అని చెప్పారు.

55
WTC ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టులోకి మార్కో జాన్సన్

అయితే ఆ వీడియోను కొంత సమయం తర్వాత తొలగించారు. దీంతో జాన్సన్ పంజాబ్ తరఫున మిగిలిన మ్యాచ్‌లకు ఆడతాడా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. మార్కో జాన్సన్ WTC ఫైనల్‌కు దక్షిణాఫ్రికా జట్టులో చేరనున్నాడు. IPL 2025 ప్లేఆఫ్‌లకు ముందు జట్టును వీడనున్నాడని ఇదివరకు పలు రిపోర్టులు పేర్కొన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories