IPL 2025 MI vs PBKS: ఐపీఎల్ 2025లో టాప్ ప్లేస్ దక్కించుకోవడానికి పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ కీలకపోరుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ బిగ్ మ్యాచ్ కు ముందు పంజాబ్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆడటంపై సందేహాలు నెలకున్నాయి.
IPL 2025 PBKS vs MI: ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన పంజాబ్ కింగ్స్ (PBKS), ముంబై ఇండియన్స్ (MI) మరో బిగ్ ఫైట్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇరు జట్ల మధ్య సోమవారం (మే 26న) కీలకమైన పోరు జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఐఫీఎల్ పాయింట్ల పట్టికలో నంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంటుంది. టాప్-2లో స్థానం కోసం ఇరు జట్లు పోటీ పడుతున్నాయి.
25
PBKS vs MI: యుజ్వేంద్ర చాహల్ మ్యాచ్ కు దూరం అయ్యాడా?
పంజాబ్ కింగ్స్ కీలక బౌలర్ యుజ్వేంద్ర చాహల్ ఆడటంపై స్పష్టత లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్పిన్ బౌలింగ్ కోచ్ సునీల్ జోషీ వెల్లడించిన ప్రకారం, చాహల్ ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌కు చిన్న గాయం కారణంగా దూరంగా ఉన్నాడు. ESPNcricinfo నివేదిక ప్రకారం, చాహల్ మళ్లీ ముంబై మ్యాచ్‌కు దూరంగా ఉండే అవకాశాలున్నాయి. అయితే, ప్లేఆఫ్స్‌కు చాహల్ అందుబాటులో ఉంటాడని మేనేజ్మెంట్ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
35
చాహల్ స్థానంలో జట్టులోకి వచ్చేది ఎవరు?
ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో, చాహల్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ జట్టులోకి వచ్చాడు. ప్రవీణ్ దుబేను ఇంపాక్ట్ సబ్‌స్టిట్యూట్‌గా ఉపయోగించారు. రెండు ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. మరోసారి జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది.
చాహల్ లేకపోవడం వల్ల పంజాబ్ బౌలింగ్ యూనిట్ కొంత బలహీనంగా కనిపించింది. ఇది ఢిల్లీపై మ్యాచ్‌లో స్పష్టమైంది. ఆ మ్యాచ్‌లో 206 పరుగులు చేసినా, శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని జట్టు ఆ స్కోరును కాపాడుకోలేకపోయింది.
ఇదే సమయంలో ముంబై ఇండియన్స్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. IPL 2025 రీస్టార్ట్ అయిన తర్వాత ఒక్కమ్యాచ్ కూడా ఓడిపోకుండా ముందుకు సాగుతోంది. గుజరాత్ టైటాన్స్ వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోవడం మొదటిసారి కాగా, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి.
ఐపీఎల్ ప్రారంభంలో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై జట్టు.. ఆ తర్వాత వరుస విజయాలతో ప్లేఆఫ్స్ కు అర్హత సాధించడమే కాకుండా.. ఇప్పుడు టాప్-2లో చోటు దక్కించుకోవాలని చూస్తోంది. బుమ్రా నమ్మకమైన బౌలింగ్, సూర్యకుమార్ యాదవ్ మిడిల్ ఆర్డర్‌లో అద్భుతమైన బ్యాటింగ్, రోహిత్ శర్మ టాప్ ఆర్డర్‌లో ఫైరవుతుండటంతో ముంబై ఈ సీజన్‌లో మరింత బలమైన జట్టుగా మారింది.
55
ముంబై పై పంజాబ్ పంజా విసురుతుందా?
శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలోపంజాబ్ కింగ్స్ కూడా అద్భుతమైన ఆటతో 11 సంవత్సరాల తర్వాత తొలిసారిగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఐపీఎల్ టైటిల్ టార్గెట్ గా ముందుకు సాగుతోంది. గత సీజన్‌లో కేకేఆర్ విజయంలో తనకు తగిన క్రెడిట్ దక్కలేదని చెప్పిన అయ్యర్, ఈ సారి పంజాబ్ కు టైటింట్ ను అందించి తన నాయకత్వాన్ని నిరూపించుకోవాలని చూస్తున్నారు. అయితే, చాహల్ లేకుండా పంజాబ్ కింగ్స్ బౌలింగ్ యూనిట్ ముంబైని ఎలా కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.