IPL 2025: విరాట్ కోహ్లీ వికెట్ తో సంచలనం.. ఎవరీ అర్షద్ ఖాన్?

Who Is Arshad Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో గుజరాత్ టైటాన్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో అర్షద్ ఖాన్ విరాట్ కోహ్లీని అవుట్  చేసిన తర్వాత ఒక్కసారిగా స్టేడియం మొత్తం సైలెంట్ అయింది. 
 

IPL 2025: Who is Arshad Khan, who became a sensation with the wicket of Virat Kohli? in telugu rma
IPL 2025: Who is Arshad Khan, who became a sensation with the wicket of Virat Kohli?

Who Is Arshad Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ధనాధన్ బ్యాటింగ్ తో పాటు నిప్పులు చెరిగే బౌలింగ్ ప్రదర్శనలతో అదిరిపోతోంది. ఐపీఎల్ 2025 తొలి ఐదు మ్యాచ్ లను గమనిస్తే సునామీ బ్యాటింగ్ తో పరుగుల వర్షం కురిసింది. అయితే, ఆ తర్వాత బౌలర్లు పంజా విసరడం మొదలుపెట్టారు.

ఈ క్రమంలోనే బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ (GT) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)ను 8 వికెట్ల తేడాతో ఓడించింది. ఇంకా 13 బంతులు మిగిలి ఉండగానే ఈ మ్యాచ్ గెలుచుకుంది. అయితే,  మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీని అద్భుతమైన డెలివరీతో అవుట్ చేసిన ఎడమచేతి వాటం పేసర్ అర్షద్ ఖాన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతున్నారు.
 

IPL 2025: Who is Arshad Khan, who became a sensation with the wicket of Virat Kohli? in telugu rma

బుధవారం ఎం చిన్నస్వామి స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్‌లో పెద్ద ఇన్నింగ్స్ ఆడాలనే ఉద్దేశంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. అయితే, ఆర్సీబీ ఇన్నింగ్స్ 2వ ఓవర్లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన 27 ఏళ్ల ఎడమచేతి వాటం పేసర్ అర్షద్ ఖాన్ బౌలింగ్ వేయడానికి వచ్చాడు. తన మొదటి ఓవర్ 4వ బంతికే విరాట్ కోహ్లీ వికెట్ తీసి అర్షద్ ఖాన్ సంచలనం సృష్టించాడు.

విరాట్ కోహ్లీని అర్షద్ ఖాన్ 7 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఔట్ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పరిస్థితి మరింత దారుణంగా మారింది.  ఈ మ్యాచ్ లో బిగ్ టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. చివరకు ఆర్సీబీ ఓటమిపాలైంది. 


IPL 2025: Who is Arshad Khan, who became a sensation with the wicket of Virat Kohli?

కోహ్లీని అవుట్ చేసిన అర్షద్ ఖాన్ ఎవరు? 

ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అర్షద్ ఖాన్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని విరాట్ కోహ్లీ బిగ్ షాట్ ఆడాడు. అయితే, మంచి కనెక్షన్ కుదరకపోవడంతో అది బౌండరీ లైన్ వద్ద నేరుగా ప్రసిద్ధ్ కృష్ణ చేతుల్లోకి వెళ్లింది. కేవలం 7 పరుగులకే విరాట్ కోహ్లీని అర్షద్ ఖాన్ పెవిలియన్ కు పంపాడు. 

అర్షద్ ఖాన్ మధ్యప్రదేశ్‌కు చెందిన 27 ఏళ్ల ఆల్ రౌండర్. అతను ఎడమచేతి వాటం మీడియం పేస్ బౌలింగ్ తో పాటు లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూడా. 2022 ఐపీఎల్ మెగా వేలంలో అర్షద్ ఖాన్‌ను ముంబై ఇండియన్స్ (ఎంఐ) మొదట రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది, కానీ గాయం కారణంగా అతను ఆ సీజన్‌కు దూరమయ్యాడు. 2023 సంవత్సరంలో, ముంబై ఇండియన్స్ (MI) అతనిని నిలుపుకుంది. అతను 6 మ్యాచ్‌లు ఆడి, 5 వికెట్లు పడగొట్టాడు.  కానీ అతను జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోలేకపోయాడు.

IPL 2025: Who is Arshad Khan, who became a sensation with the wicket of Virat Kohli?

రూ.1.30 కోట్లకు అర్షద్ ఖాన్‌ను దక్కించుకున్న గుజరాత్ 

IPL 2023 తర్వాత ముంబై ఇండియన్స్ (MI) అర్షద్ ఖాన్‌ను విడుదల చేసింది. లక్నో సూపర్ జెయింట్స్ (LSG) IPL 2024 సీజన్ కోసం అర్షద్ ఖాన్‌ను జట్టులోకి తీసుకుంది. అతను కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి, ఒక వికెట్ తీసుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై 33 బంతుల్లో 58* పరుగులు చేసి హాట్ టాపిక్ అయ్యాడు. కానీ, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) అర్షద్ ఖాన్‌ను వదులుకుంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ (GT) అర్షద్ ఖాన్‌ను రూ.1.30 కోట్లకు కొనుగోలు చేసింది. 

అర్షద్ ఖాన్ ప్రత్యేకత ఏంటి?  

అర్షద్ ఖాన్ ప్రమాదకరమైన ఎడమచేతి వాటం మీడియం పేస్ బౌలర్. అతను బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. అలాగే, లోయర్ ఆర్డర్ లో రాణించగల బ్యాట్స్‌మన్. అర్షద్ ఖాన్ కు భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ టాస్ సందర్భంగా శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ, దక్షిణాఫ్రికా సూపర్‌స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాల వల్ల ఆడటం లేదని, అందుకే కగిసో రబాడ స్థానంలో అర్షద్ ఖాన్‌ను గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 చేర్చామని తెలిపాడు.

Latest Videos

vuukle one pixel image
click me!