RCB vs GT IPL : వ‌ద్దనుకుంటే ఓడించాడు.. ఆర్సీబీపై సిరాజ్ మియా విధ్వంసం

Mohammed Siraj wreaked havoc on RCB: ఐపీఎల్ 2025లో త‌న అద్భుత‌మైన బౌలింగ్ లో మ‌హ్మ‌ద్ సిరాజ్ విరాట్ కోహ్లీ టీమ్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు దిమ్మ‌దిరిగే షాక్ ఇచ్చాడు. త‌న టీమ్ గుజ‌రాత్ టైటాన్స్ కు సూపర్ విక్ట‌రీని అందించాడు. 

Mohammed Siraj

RCB vs GT IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం అద్భుతమైన బౌలింగ్ తో అదరగొట్టే ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. ఆర్సీబీ జట్టుకు చాలానే విజయాలు అందించాడు. అయితే, ఆ టీమ్ తనను వద్దనుకుంది. ఐపీఎల్ మెగా వేలానికి ముందు తనను వదులుకుంది. తనను వదులుకున్న ఆర్సీబీపై వారి సొంత గ్రౌండ్ లో సూప‌ర్ బౌలింగ్ తో విధ్వంసం సృష్టించాడు సిరాజ్ మియా. పెద్ద‌గా ప‌రుగులు ఇవ్వ‌కుండా కీల‌క‌మైన 3 వికెట్లు తీసుకుని ఆర్సీబీని దెబ్బ‌కొట్టి గుజ‌రాత్ టైటాన్స్ కు విజ‌యాన్ని అందించాడు.

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 14వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో డామినేటింగ్ ఆట‌తో బెంగ‌ళూరును చిత్తుగా ఓడించింది గుజ‌రాత్. ఈ విజ‌యంలో సిరాజ్ మియా కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో ఫిల్ సాల్ట్, దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్, లివింగ్ స్టోన్ వికెట్ల‌ను తీసుకోవ‌డంతో పాటు త‌న 4 ఓవ‌ర్ల బౌలింగ్ లో కేవ‌లం 19 ప‌రుగులు మాత్ర‌మే ఇచ్చాడు. త‌న సూప‌ర్ బౌలింగ్ తో ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. 

Mohammed Siraj in action (Photo; IPLBCCI)

మ‌హ్మ‌ద్ సిరాజ్-టీమిండియా టాప్ ఫాస్ట్ బౌల‌ర్ 

టీమిండియా టాప్ ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఒక‌రు. ఐపీఎల్ లో అద్భుత‌మైన పేస్ బౌలింగ్ తో  నిల‌క‌డ‌గా రాణిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు (ఏప్రిల్ 2025) మ‌హ్మ‌ద్ సిరాజ్ 96 ఐపీఎల్ మ్యాచ్ ల‌ను ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. 21 పరుగులిచ్చి 4 వికెట్లు తీసుకోవ‌డం అత‌ని ఐపీఎల్ బెస్ట్ బౌలింగ్ రికార్డు. 7 సార్లు 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 2 సార్లు 4 వికెట్లు తీసుకున్నాడు. అలాగే, ఐపీఎల్ లో 4 మెయిడిన్ ఓవ‌ర్లు కూడా వేశాడు. ఇప్ప‌టివ‌ర‌కు అత‌ను ఆడిన ఐపీఎల్ టీమ్ ల‌కు ఎంతో విలువైన బౌల‌ర్ అని నిరూపించాడు.

2017 వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) INR 2.6 కోట్లకు సిరాజ్‌ను కొనుగోలు చేసింది. దీంతో అత‌ని ఐపీఎల్ ప్ర‌యాణం మొద‌లైంది. 2022, 2023, 2024 సీజన్లలో సిరాజ్‌ను ఆర్సీబీ రూ 7 కోట్లకు రిటైన్ చేసుకుంది. కానీ, ఆ త‌ర్వాత‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు వ‌దులుకోవ‌డంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో సిరాజ్ ను గుజరాత్ టైటాన్స్  రూ. 12.25 కోట్లకు ద‌క్కించుకుంది. దీంతో బెంగ‌ళూరు టీమ్ తో త‌న 7 సంవ‌త్స‌రాల బంధానికి ముగింపు కార్డు ప‌డింది.


Image credit: TwitterGujarat Titans

IPL 2025లో సిరాజ్ ప్రదర్శన గ‌మ‌నిస్తే.. గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. తాజాగా ఆర్సీబీపై అద్భుత‌మైన బౌలింగ్ తో 3 వికెట్లు తీసుకున్నారు. 2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో హైదరాబాద్ తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. 2017లో హైద‌రాబాద్ టీమ్ నుంచి ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చాడు. 2020లో ఐపీఎల్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో వరుసగా 2 మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. 

కాగా, ఆర్సీబీ vs జీటీ మ్యాచ్ లో రెండు వికెట్లు తీసిన తర్వాత, సిరాజ్ పోర్చుగీస్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో ​​రొనాల్డో లాగా సంబరాలు చేసుకున్నాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది. 

సిరాజ్ సెలబ్రేషన్స్ వీడియో ఇక్కడ  చూడండి

Latest Videos

click me!