IPL 2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్-5 ప్లేయర్లు

Published : May 28, 2025, 03:43 PM IST

IPL 2025 Top 5 Six Hitters: ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌ దశకు చేరుకుంది. ఈ సీజన్ లో కూడా బ్యాటర్ల మధ్య సిక్సర్ల పోటీ కనిపించింది. అయితే, అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 5 బ్యాట్స్‌మెన్లు ఎవరో మీకు తెలుసా?

PREV
16
IPL 2025 లో బ్యాట్స్‌మెన్‌ల హంగామా

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్లేఆఫ్స్ దశకు చేరుకుంది. చాలా మంది ప్లేయర్లు అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. ఫోర్లు, సిక్సర్ల మోత మోగించారు. స్టేడియానికి వచ్చిన క్రికెట్ లవర్స్ ను పరుగుల వర్షంలో ముంచెత్తారు.

26
1. నికోలస్ పూరన్ (లక్నో సూపర్ జెయింట్స్)

ఐపీఎల్ 2025లో లీగ్ దశ ముగిసే సరికి  అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్ల లిస్టులో  మొదటి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ నికోలస్ పూరన్ ఉన్నారు. ఈ ఎడమచేతి వాటం కరేబియన్ బ్యాట్స్‌మన్ 14 మ్యాచ్‌లలో 40 సిక్సర్లు కొట్టాడు. లక్నో జట్టు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేదు కాబట్టి పూరన్ కు ఇక మ్యాచ్‌లు లేవు.

36
2. మిచెల్ మార్ష్ (లక్నో సూపర్ జెయింట్స్)

రెండవ స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ బ్యాట్స్‌మన్ మిచెల్ మార్ష్ ఉన్నారు. ఈ బ్యాట్స్‌మన్ 14 మ్యాచ్‌లలో 37 సిక్సర్లు కొట్టాడు.

46
3. సూర్యకుమార్ యాదవ్ (ముంబై ఇండియన్స్)

మూడవ స్థానంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు. సూర్య 14 మ్యాచ్‌లలో 32 సిక్సర్లు కొట్టాడు. సూర్య బ్యాట్ నుంచి మరిన్ని సిక్సర్లు వచ్చే ఛాన్స్ ఉంది.

56
4. శ్రేయాస్ అయ్యర్ (పంజాబ్ కింగ్స్)

నాలుగో స్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 31 సిక్సర్లు కొట్టాడు. పంజాబ్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో  ఉంది కాబట్టి అయ్యర్ నుంచి మరిన్ని సిక్సర్లు చూడవచ్చు. 

66
5. అభిషేక్ శర్మ (సన్‌రైజర్స్ హైదరాబాద్)

ఐపీఎల్ 2025లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో అభిషేక్ శర్మ ఐదవ స్థానంలో ఉన్నారు. ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ 14 మ్యాచ్‌లలో 28 సిక్సర్లు కొట్టాడు.

Read more Photos on
click me!

Recommended Stories