Published : May 27, 2025, 09:58 PM ISTUpdated : May 28, 2025, 10:39 AM IST
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ 20 ఓవర్లలో 227/3 పరుగులు చేసింది.
లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : పంత్ సూపర్ నాక్
IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లేఆఫ్ రేసులో కీలకమైన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ తన బ్యాట్ తో మెరుపులు మెరిపించాడు. సీజన్ మొత్తం నిరాశాజనక ప్రదర్శన చేసిన పంత్ చివరి మ్యాచ్‌లో చెలరేగి సెంచరీ కొట్టాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 చివరి లీగ్ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ టీమ్ భారీ స్కోర్ చేసింది.
25
ఆర్సీబీపై రిషబ్ పంత్ సెంచరీ
ఈ మ్యాచ్ ఆర్సీబీకి అత్యంత కీలకం. టాప్-2లోకి వెళ్లాలంటే ఈ గేమ్ గెలవాల్సిందే. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రారంభంలోనే బ్రీట్జ్‌కి ఔట్ తో ఆర్సీబీ తొలి వికెట్ దక్కింది. అయితే మూడో స్థానంలో క్రీజులోకి వచ్చిన పంత్ మ్యాచ్ ఫలితాన్ని మార్చేసే ఇన్నింగ్స్ ఆడాడు. అద్భుతమైన సెంచరీ సాధించాడు.
35
55 బంతుల్లోనే సెంచరీ కొట్టిన రిషబ్ పంత్
రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చిన వెంటనే దూకుడుగా ఆడుతూ 55 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్సర్లతో తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ సెంచరీని సాధించాడు. ఈ పర్ఫార్మెన్స్‌తో పంత్ తన రూ. 27 కోట్ల ఐపీఎల్ వేలం విలువకు కొంచమైనా న్యాయంచేసినట్టు చెప్పవచ్చు. సెంచరీ తర్వాత రిషబ్ పంత్ ‘స్పైడర్‌మ్యాన్ సెలబ్రేషన్’ చేసుకున్నాడు.
మరో ఎండ్‌లో మిచెల్ మార్ష్ కూడా సూపర్ నాక్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 67 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. పంత్‌తో కలిసి లక్నో స్కోర్ ను పరుగులు పెట్టించాడు. వీరిద్దరి భాగస్వామ్యంతో లక్నో భారీ స్కోరు నమోదు చేసింది. 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.
55
ఆర్సీబీ బౌలర్లు విఫలం
రిషబ్ పంత్ పటాకా ఇన్నింగ్స్‌కు, మిచెల్ మార్ష్ మెరుపు ఇన్నింగ్స్ లకు చెక్ పెట్టడంలో ఆర్సీబీ బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. బౌలింగ్ మార్పులతో ప్రయత్నించినా పెద్దగా ప్రయోజనం లేకపోయింది. ముఖ్యమైన మ్యాచ్‌లో తమ పర్ఫార్మెన్స్‌తో నిరాశపరిచారు.