RCB vs LSG : ఆర్సీబీని దంచికొట్టిన లక్నో.. రిషబ్ పంత్ సూపర్ సెంచరీ

Published : May 27, 2025, 09:17 PM ISTUpdated : May 27, 2025, 09:20 PM IST

IPL 2025 LSG vs RCB: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్ తో పరుగుల వరద పారించాడు. మిచెల్ మార్ష్ అద్భుతమైన నాక్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు.

PREV
15
LSG vs RCB: లక్నో బ్యాటర్లు దంచికొట్టారు

IPL 2025 LSG vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 చివరి లీగ్ మ్యాచ్‌, 70వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఎకానా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో టీమ్ పరుగుల వరద పారించింది.

25
LSG v RCB: రిషబ్ పంత్ సూపర్ సెంచరీ

ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ప్లేయర్, కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ బ్యాట్ నుంచి ఇప్పటివరకు పెద్దగా పరుగులు రాలేదు. కానీ, ఈ సీజన్ లో తమ చివరి మ్యాచ్ లో ఆర్సీబీపై దుమ్మురేపే బ్యాటింగ్ తో అదరగొట్టాడు. సిక్సర్ల మోత మోగిస్తూ సెంచరీ కొట్టాడు.

35
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నఆర్సీబీ

లక్నోలోని ఎకానా క్రికెట్ స్టేడియంలో IPL 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో టీమ్ మొదట బ్యాటింగ్ చేసింది. నువాన్ తుషార మాథ్యూ బ్రీట్జ్కేను ఔట్ చేయడంతో ఆర్సీబీకి తొలి బ్రేక్‌త్రూ ఇచ్చాడు.

45
మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన రిషబ్ పంత్ సూపర్ నాక్ ఆడాడు

మాథ్యూ అవుట్ కావడంతో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. సుయాష్ శర్మ బౌలింగ్ లో రిషబ్ పంత్ ఒక ఫోర్ తో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. తన సెంచరీ ( 100* పరుగులు) ఇన్నింగ్స్ లో 6 సిక్సర్లు, 10 ఫోర్లు బాదాడు. ఫోర్ తో సెంచరీని పూర్తి చేశాడు. రిషబ్ పంత్ కు ఇది రెండో ఐపీఎల్ సెంచరీ. తన సెంచరీతో లక్నో స్కోర్ డబుల్ సెంచరీ మార్కును దాటింది.   

55
లక్నో తరఫున మరో రికార్డు సాధించిన మిచెల్ మార్ష్

మిచెల్ మార్ష్ మరోసారి అద్భుతమైన నాక్ ఆడాడు. 37 బంతుల్లో 67 పరుగుల ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాదాడు. ఈ క్రమంలోనే ఒక సీజన్ లో లక్నో తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. 

ఒకే సీజన్‌లో LSG తరపున అత్యధిక పరుగులు

621* - మిచెల్ మార్ష్ (2025)

616 - KL రాహుల్ (2022)

520 - KL రాహుల్ (2024)

511* - నికోలస్ పూరన్ (2025)

508 - క్వింటన్ డి కాక్ (2022)

Read more Photos on
click me!

Recommended Stories