IPL 2025 : ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ప్లేయ‌ర్లు

Published : Mar 16, 2025, 07:22 PM IST

Top 5 Most Expensive Players in IPL: రిషబ్ పంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. పంత్ తో పాటు ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన టాప్-5 ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
16
IPL 2025 : ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ప్లేయ‌ర్లు
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

Top 5 most expensive players in IPL 2025: ఐపీఎల్ 2025 వేలం ఊహించ‌ని విధంగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టింది. చాలా మంది ప్లేయ‌ర్లు రికార్డు బ్రేకింగ్ ధరలను పొందారు. ఈ విష‌యంలో రిషబ్ పంత్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొత్తంగా ఐపీఎల్ హిస్ట‌రీలోనే అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా రిష‌బ్ పంత్ రికార్డు సాధించాడు. అయితే, ఇప్పుడు ఐపీఎల్ లో అత్యంత ఖ‌రీదైన టాప్-5 ప్లేయ‌ర్లు ఎవ‌రో ఇప్పుడు తెలుసుకుందాం. 

26
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

1. రిషబ్ పంత్ (₹27 కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్):

రిషబ్ పంత్ ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అతని ధ‌నాధ‌న్ సునామీ బ్యాటింగ్ శైలి, వికెట్ కీపింగ్ సామర్థ్యాలతో భారీ డిమాండ్ క‌లిగిన ప్లేయ‌ర్ గా మార్చాయి. అత‌నికి కోసం చాలా జ‌ట్లు పోటీ ప‌డ్డాయి. చివ‌ర‌కు లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఏకంగా 27 కోట్ల రూపాయ‌లు పెట్టి పంత్ ను ద‌క్కించుకుంది. ఐపీఎల్ 2025లో ల‌క్నో టీమ్ ను రిష‌బ్ పంత్ న‌డిపించ‌నున్నాడు. పంత్ చాలా డైనమిక్ ప్లేయ‌ర్, అలాగే, మ్యాచ్ ను మ‌లుపు తిప్ప‌గ‌ల స‌త్తా ఉన్న ప్లేయ‌ర్. 

36
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

2. శ్రేయాస్ అయ్యర్ (₹26.75 కోట్లు, పంజాబ్ కింగ్స్):

శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్ 2025 వేలంలో రికార్డు ధ‌ర‌ను ప‌లికాడు. రిష‌బ్ పంత్ త‌ర్వాత అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ గా నిలిచాడు. అంత‌కుముందు కేకేఆర్ జ‌ట్టులో ఉన్న అయ్య‌ర్ ను పంజాబ్ కింగ్స్ వేలంలో 26.75 కోట్ల‌కు ద‌క్కించుకుంది. వ‌రుస‌గా స్థిరమైన ప్రదర్శనలు, గొప్ప కెప్టెన్సీ లక్షణాలు అతన్ని ఐపీఎల్‌లో విలువైన ప్లేయ‌ర్ గా మ‌ర్చాయి. రాబోయే సీజ‌న్ లో పంజాబ్ ను ఐపీఎల్ టైటిల్ వైపు అయ్య‌ర్ న‌డిపిస్తాడ‌ని పంజాబ్ టీమ్ భారీ అంచ‌నాలు పెట్టుకుంది. 

46
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

3. వెంకటేష్ అయ్యర్ (₹23.75 కోట్లు, కోల్‌కతా నైట్ రైడర్స్):

వెంకటేష్ అయ్యర్ ఆల్ రౌండ్ సామర్థ్యాలతో గుర్తింపు పొందాడు. అందుకే అతని కోసం కోల్‌కతా నైట్ రైడర్స్ ఏకంగా 23.75 కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసింది. బ్యాట్, బంతితో అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌లతో స్టార్ ప్లేయర్ గా ఎదిగాడు. ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్ త‌ర‌ఫున సూప‌ర్ ఇన్నింగ్స్ ల‌తో అద‌ర‌గొట్టాడు. అత‌ని అద్భుత‌ ప్రదర్శనలు కేకేఆర్ కోసం కీలక ఆటగాడిగా చేశాయి. 

56
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

4. హెన్రిచ్ క్లాసెన్ (రూ.23 కోట్లు, సన్‌రైజర్స్ హైదరాబాద్):

సౌతాఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్  హెన్రిచ్ క్లాసెన్ కు ఐపీఎల్ లో మస్తు డిమాండ్ ఉంది. గత ఐపీఎల్ లో మంచి ప్రదర్శనలు ఇచ్చిన అతన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 23 కోట్ల రూపాయలకు రిటైన్ చేసుకుంది. ఈ రిటెన్షన్ ధరతో అతను IPL 2025 సీజన్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్ల లిస్టులో చేరాడు. హెన్రిచ్ క్లాసెన్ విధ్వంసకర బ్యాటింగ్ హిట్టింగ్ సామర్థ్యంతో బిగ్ స్టార్ మిడిల్-ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా కొన‌సాగుతున్నాడు. అందుకే అత‌నికి బాగా డిమాండ్ ఉంది. 

66
IPL 2025: Top 5 Most Expensive Players in IPL

5. విరాట్ కోహ్లీ (రూ.21 కోట్లు, రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు): 

ఐపీఎల్ 2025లో అత్యంత ఖ‌రీదైన ప్లేయ‌ర్ల‌లో విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో కొనసాగుతున్న కింగ్ కోహ్లీని ఆ టీమ్ 21 కోట్ల రూపాయ‌ల‌తో రిటైన్ చేసుకుంది. క్రికెట్ ప్ర‌పంచంలో ర‌న్ మిష‌న్ గా గుర్తింపు పొందిన విరాట్ కోహ్లీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ లో ఆర్సీబీ కోసం విరాట్ కోహ్లీ అనేక అద్భుత‌మైన ఇన్నింగ్స్ ల‌ను ఆడాడు. అలాగే, ఐపీఎల్ లో అత్య‌ధిక ప‌రుగుల‌తో పాటు అనేక రికార్డులు సాధించాడు.

Read more Photos on
click me!

Recommended Stories