IPL 2025: ఐపీఎల్ 2025 టైటిల్ గెలిచిది ఆ జట్టేనా !

Published : May 21, 2025, 08:16 PM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 తుదిదశకు చేరుకుంది. దీంతో టైటిల్ ఎవరు గెలుస్తారనే చర్చ మొదలైంది. ఐపీఎల్ 2025 టైటిల్ రేసులో బలమైన జట్లు ఏవి? ఎవరు టైటిల్ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

PREV
16
క్లైమాక్స్‌కు చేరిన ఐపీఎల్ 2025 టైటిల్ రేస్

IPL 2025 title race: ఐపీఎల్ 2025 టైటిల్ రేస్ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఇప్పటివరకు ఎప్పుడూ విజేతలుగా నిలవని జట్లు ట్రోఫీ సాధించాలని అభిమానులు ఆశిస్తున్న వేళ.. ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్స్ కు చేరుకున్నాయి. వాటిలో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ఉన్నాయి. చివరి బెర్త్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి.

26
IPL 2025 టైటిల్ ఫేవరెట్ గా ఆర్సీబీ

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్రస్తుతం బలమైన పోటీదారులుగా ఉన్నాయి. 25 మే 2025 న జరగనున్న ఫైనల్‌కి ముందు, ఇప్పటికే మునుపటి విజేతలు అయిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ ట్రోఫీ రేసు నుంచి అవుట్ అయ్యాయి. గతేడాది ఫైనలిస్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ దారుణ ప్రదర్శనతో వెనక్కి తగ్గింది. 

36
గుజరాత్ టైటాన్స్ కూడా బరిలో ఉంది

ప్రస్తుతం పోటీ ప్రధానంగా ఐదు జట్ల మధ్య కొనసాగుతోంది. వీటిలో ఇప్పటివరకు టైటిల్ గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ కూడా ఉన్నాయి. అలాగే, ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేత ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ కూడా బరిలో ఉన్నాయి. అయితే, ఆర్సీబీ, ఎంఐ జట్లు బలంగా కనిపిస్తున్నాయి.

46
బలంగా పుంజుకున్న ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుస్తుందా?

ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తమ చివరి ఐదు మ్యాచ్‌లను విజయం సాధించి మరింత బలంగా మారింది. భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి ఆటగాళ్లతో తమ స్థిరత్వాన్ని చాటుతోంది. విదేశీ ఆటగాళ్లు కూడా టీమ్ ప్రదర్శనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో బుమ్రా, బౌల్ట్, దీపక్ చహర్, మిచెల్ సాంట్నర్ అదరగొడుతున్నారు.

56
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ కల నెరవేరుతుందా?

ఆర్సీబీ ఈసారి అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన ఇస్తోంది. విరాట్ కోహ్లీ, జోష్ హేజిల్ వుడ్, టిమ్ డేవిడ్, రజత్ పాటిదార్, షేఫార్డ్, ఫిల్ సాల్ట్, పాండ్యా వంటి స్టార్లతో మంచి ప్రదర్శనలు చేస్తోంది. ఈ సీజన్‌లో టైటిల్ గెలుపు అవకాశాలు ఆర్సీబీకి అధికంగా ఉన్నాయి. గత సీజన్లకు భిన్నంగా ఈసారి వారి ప్రదర్శన మెరుగ్గా ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు.

66
ఇతర జట్ల సంగతేంటి?

గుజరాత్ టైటన్స్ గట్టిగా పోటీలో ఉన్నప్పటికీ, వారిలో బౌలింగ్ విభాగం అనుకున్న స్థాయిలో బలంగా లేదు. పంజాబ్ కింగ్స్, మంచి టాలెంట్ ఉన్నప్పటికీ.. ఆ జట్టు తడబాటు అవకాశాలను దెబ్బతీసే అవకాశముంది. ఐపీఎల్ టైటిల్ రేసులో ముంబై ఇండియన్స్ రికార్డు సృష్టించే అవకాశం ఉంది. ఢిల్లీకి కూడా అవకాశాలు  ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories