Shikhar Dhawan: శిఖర్ ధావన్ కొత్త ఇల్లు.. ధర తెలిస్తే షాక్ అవుతారు !

Published : May 21, 2025, 05:31 PM IST

Shikhar Dhawan buys luxury apartment: టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 'ది డాలియాస్' ప్రాజెక్ట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ధావన్ కొత్త ఇల్లు ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ అవుతారు !

PREV
15
డీఎల్ఎఫ్ 'ది డాలియాస్' ప్రాజెక్ట్‌లో లగ్జరీ ఫ్లాట్‌ కొన్న శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ గురుగ్రామ్‌లోని డీఎల్ఎఫ్ 'ది డాలియాస్' ప్రాజెక్ట్‌లో రూ.69 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారు. ఈ  డీల్ ఫిబ్రవరి 4, 2025 న కుదిరింది. 6,040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్, దేశంలోనే అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ ఒప్పందాల్లో ఒకటిగా నిలిచింది.

25
సెక్టార్ 54, గురుగ్రామ్ లో శిఖర్ ధావన్ కొత్త ఇల్లు

DLF5 గోల్ఫ్ లింక్స్, సెక్టార్ 54, గురుగ్రామ్ లో 6,040 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ ధర రూ.65.61 కోట్లు. ఇతర పన్నులు అన్ని కలిపి రూ.68.89 కోట్లు అని సమాచారం. ఫిబ్రవరి 4, 2025 న రిజిస్టర్ చేసిన ఈ ఫ్లాట్ కు 5 పార్కింగ్ స్లాట్‌లు ఉన్నాయి.

35
ది డాలియాస్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్
'ది డాలియాస్' భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్ట్. గోల్ఫ్ కోర్స్ రోడ్డులో 17 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ లో 8 టవర్లు, 420 ఫ్లాట్‌లు ఉన్నాయి. మొదటి దశలో విడుదల చేసిన 173 ఫ్లాట్‌లన్నీ అమ్ముడయ్యాయి.
45
క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన శిఖర్ ధావన్

శిఖర్ ధావన్ గత సంవత్సరం అంతర్జాతీయ, దేశీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. తన కెరీర్ పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, దేశానికి ప్రాతినిధ్యం వహించినందుకు గర్వంగా ఉందని అన్నారు.

55
సోఫీతో లవ్ లో శిఖర్ ధావన్ !

శిఖర్ ధావన్ ఇప్పటికే విడాకులు తీసుకోగా, ప్రస్తుతం ఆయన ఐరిష్ స్నేహితురాలు సోఫీతో ప్రేమలో ఉన్నారని సమాచారం. సోఫీతో కలిసి శిఖర్ ఈ అపార్ట్‌మెంట్‌లో నివసించవచ్చని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories