భారీ టార్గెట్ తో రెండో ఇన్నింగ్స్ ను మొదలుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మంచి ఆరంభం అందించారు. తొలి వికెట్ కు 49 పరుగుల భాగస్వామ్యం లభించింది. ట్రావిస్ హెడ్ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ ధనాధన్ బ్యాటింగ్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. 74 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు పెద్దగా రాణించకపోవడంతో హైదరాబాద్ కు ఓటమి తప్పలేదు. హైదరాబాద్ టీమ్ 186-6 పరుగులు మాత్రమే చేసి 38 పరుగుల తేడాతో ఓడిపోయింది.