IPL 2025 రద్దైతే ఆటగాళ్లకు పూర్తి జీతం వస్తుందా?

Published : May 11, 2025, 01:04 AM ISTUpdated : May 11, 2025, 01:08 AM IST

IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ మధ్యలోనే ఆగిపోయింది. పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో తాత్కాలికంగా నిలివేశారు. ఒకవేళ ఐపీఎల్ మొత్తం రద్దు అయితే, ఆటగాళ్లకు పూర్తి సీజన్ జీతం వస్తుందా? రాదా? ఐపీఎల్ నియమాలు ఎలా ఉంటాయి.

PREV
15
IPL 2025 రద్దైతే ఆటగాళ్లకు పూర్తి జీతం వస్తుందా?

 భారత్ పాకిస్తాన్ ఇటీవలి ఉద్రిక్తతలు, దాడుల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 ప్రభావం పడింది. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ ను మధ్యలోనే నిలిపివేశాడు. భారత్, పాక్ ఉద్రిక్తతలే దీనికి ప్రధాన కారణం. 

25
ఢిల్లీ, పంజాబ్ మ్యాచ్‌లో సమస్య

ధర్మశాలలో పంజాబ్, ఢిల్లీ మధ్య మ్యాచ్ జరుగుతుండగా, భద్రతా కారణాల రీత్యా ఫ్లడ్ లైట్లు ఆపేశారు. పాకిస్తాన్ వైపు నుంచి పంజాబ్, జమ్మూ నగరాల్లో వైమానిక దాడులే ఇందుకు కారణం. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ నిర్ణయం  తీసుకున్నాడు. 

IPL ఛైర్మన్ మ్యాచ్‌ను ఆపి, ఆటగాళ్లను, ప్రేక్షకులను మైదానం నుంచి బయటకు పంపారు. మరుసటి రోజు మొత్తం సీజన్‌ను నిలిపివేశారు.

35

ఐపీఎల్ 2025 సీజన్ ఆగిపోతే ఆటగాళ్లకు పూర్తి జీతం వస్తుందా? వారి జీతంలో కోత ఉంటుందా? వంటి సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి.

45
ఐపీఎల్ ఆగితే ఆటగాళ్ల జీతం తగ్గుతుందా?

ఐపీఎల్ టోర్నమెంట్ మధ్యలో ఆగిపోయినా, ఆటగాళ్ల జీతంలో ఎలాంటి కోత ఉండదు. ప్లేయర్లు వేలంలో దక్కించుకున్న పూర్తి డబ్బును అందుకుంటారు. 

55
ఐపీఎల్ నియమాలు ఏం చెబుతున్నాయి?

IPL నియమం ప్రకారం, సీజన్‌కు అందుబాటులో ఉన్న ఆటగాడికి పూర్తి జీతం చెల్లిస్తారు. ఎన్ని మ్యాచ్‌లు ఆడినా, తుది జట్టులోకి ఎంపికైనా కాకపోయినా జీతంపై ప్రభావం ఉండదు. వేలంలో లేదా కాంట్రాక్టులో అనుకున్న విధంగా ప్లేయర్లు చేసుకున్న ఒప్పందంలో భాగంగా పూర్తి డబ్బును అందుకుంటారు. అన్ని మ్యాచ్ లు ఆడకపోయినా వారికి దక్కే డబ్బు అందుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories