IPL 2025 SRH vs LSG : శార్దూల్ హ్యాట్రిక్ మిస్, వరుసబంతుల్లో W,W...సన్ రైజర్స్ కు బిగ్ షాక్
సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీసాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
సన్ రైజర్స్ హైదరాబాద్ కు బిగ్ షాక్ తగిలింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ టాప్ ఆర్డర్ ను దెబ్బతీసాడు. వరుస బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టాడు.
IPL 2025 : సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వికెట్ కోల్పోయింది. లక్నో సూపర్ జాయింట్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ఓపెనర్ అభిషేక్ శర్మ ను ఔట్ చేసాడు. ఆ వెంటనే సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ డకౌట్ అయ్యాడు. దీంతో కేవలం 15 పరుగుల వల్లే హైదరాబాద్ టీం 2 వికెట్లు కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ వేసిన మూడో బంతిని నితీష్ కుమార్ రెడ్డి అడ్డుకున్నాడు. దీంతో శార్దూల్ హ్యాట్రిక్ మిస్సయ్యాడు.
ఓవైపు వికెట్లు పడుతున్నా ట్రావిస్ హెడ్ ఏమాత్రం తగ్గడంలేదు. నితీష్ రెడ్డితో కలిసి ఇన్నింగ్ ను చక్కదిద్దుతూనే భారీ షాట్లతో విరుచుకుపడుతున్నాడు. ఆవేష్ ఖాన్ వేసిన ఓవర్లో వరుస బౌండరీలతో 18 పరుగులు రాబట్టాడు దీంతో సన్ రైజర్స్ స్కోరు దూసుకుపోతోంది. ఎక్కడా వికెట్లు పడిన ప్రభావం కనిపించడంలేదు.
ఐపిఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోని ఆటగాడు శార్దూల్ ఠాకూర్ అనూహ్యంగా జట్టులోకి వచ్చాడు. మెహ్సిన్ ఖాన్ గాయంతో జట్టునుండి తప్పుకోవడంతో శార్దూల్ కు లక్నోలో ఆడే అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకున్ని ఠాకూర్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు.