Travis Head-Ishan Kishan
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో పరుగుల పటాసులు పేలుతున్నాయి. బౌలర్లపై బ్యాట్స్ మెన్లు విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ 2025లో సాగిన మ్యాచ్ లలో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లు తప్ప, మిగతా మ్యాచ్‌లన్నీ భారీ స్కోరింగ్ మ్యాచ్ లే.
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు వివిధ జట్ల నుండి మొత్తం 15 మంది ఆటగాళ్లు హాఫ్ సెంచరీలు సాధించాడు. సెంచరీతో పాటు సెంచరీకి దగ్గరగా వచ్చిన ఇన్నింగ్స్ లు కూడా ఉన్నాయి. సునామీ ఇన్నింగ్స్ లను ఆడిన వారిలో 9 మంది భారత బ్యాట్స్‌మెన్ ఉండగా, 7 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ 2025 తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీలు సాధించిన భారత బ్యాట్స్‌మెన్‌లలో రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ ధ్రువ్ జురెల్, సంజు సామ్సన్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, గుజరాత్ టైటాన్స్ తరపున సాయి సుదర్శన్, కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అశుతోష్ శర్మ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రితురాజ్ గైక్వాడ్ ఉన్నారు.
Ishan Kishan. (Photo- IPL)
ఇప్పటివరకు ఐపీఎల్ 2025 టాప్ స్కోరర్లు
1. ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2025లో ఇప్పటివరకు ఇషాన్ కిషన్ అత్యధిక పరుగులు చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. 47 బంతుల్లో 106 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ కిషన్ సునామీ ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. హైదరాబాద్ టీమ్ తరఫున అతనికి ఇది తొలి మ్యాచ్.
2. ధ్రువ్ జురెల్
రాజస్థాన్ రాయల్స్ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ ధ్రువ్ జురెల్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ టోర్నమెంట్‌లో ధ్రువ్ జురెల్ 2 మ్యాచ్‌ల్లో మొత్తం 103 పరుగులు చేశాడు. 70 పరుగులు అతని అత్యధిక స్కోరు.
3. క్వింటన్ డి కాక్
బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఓపెనర్ క్వింటన్ డి కాక్ 97 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీనితో, అతను ఈ టోర్నమెంట్‌లో తన తొలి అర్ధ సెంచరీని కూడా సాధించాడు. క్వింటన్ డి కాక్ 2 మ్యాచ్‌ల్లో మొత్తం 101 పరుగులు చేశాడు.
4. శ్రేయాస్ అయ్యర్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ టోర్నమెంట్‌లో తన తొలి మ్యాచ్‌లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అతని అత్యధిక స్కోరు 97 పరుగులు.
5. సంజూ శాంసన్
రాజస్థాన్ రాయల్స్ తరఫున సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ చేశాడు. అతను 2 మ్యాచ్‌ల్లో 79 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 66 పరుగులు.
6. నికోలస్ పూరన్
లక్నో సూపర్ జెయింట్స్‌కు చెందిన నికోలస్ పూరన్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీపై 75 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
7. సాయి సుదర్శన్
పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ 74 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
Image Credit: ANI
8. అజింక్య రహానే
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే తన తొలి అర్ధ సెంచరీ సాధించాడు. రెండు మ్యాచ్‌ల్లో రహానే 74 పరుగులు చేశాడు. 56 అతని అత్యధిక స్కోరు.
9. మిచెల్ మార్ష్
లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్ మిచెల్ మార్ష్ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 72 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని అత్యధిక స్కోరు 72 పరుగులు.
11. అశుతోష్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున తొలి మ్యాచ్‌లో అశుతోష్ శర్మ 66 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడాడు.
10. ట్రావిస్ హెడ్
తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ 67 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్ అత్యధిక స్కోరు 67 పరుగులు.
12. రచిన్ రవీంద్ర
చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఓపెనర్ రచిన్ రవీంద్ర 65 పరుగులు చేశాడు.
13. విరాట్ కోహ్లీ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ తన తొలి మ్యాచ్‌లో 59 పరుగులు చేశాడు.
14. ఫిల్ సాల్ట్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఫిల్ సాల్ట్ 56 పరుగులు చేశాడు.
15. జోస్ బట్లర్
గుజరాత్ టైటాన్స్ తరఫున, వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ మొదటి మ్యాచ్‌లో 54 పరుగులు చేశాడు.
16. రితురాజ్ గైక్వాడ్
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తొలి మ్యాచ్‌లో అర్ధ సెంచరీ సాధించాడు. ముంబై ఇండియన్స్ పై గైక్వాడ్ 53 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.