ఐపిఎల్ లో అభిషేక్ శర్మ విధ్వంసం
అభిషేక్ శర్మ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్‌లో 16 ఇన్నింగ్స్‌లలో 484 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ 204.21గా ఉంది. ట్రావిస్ హెడ్‌తో కలిసి అతను ఆడిన ఓపెనింగ్ భాగస్వామ్యం టోర్నమెంట్‌లో హైలైట్‌గా నిలిచింది. ఐపిఎల్ అతడి ప్రదర్శన టీమిండియా తలుపులు తట్టింది... ఎస్ఆర్‌హెచ్ తరపున ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ ఇండియాకు ఆడాలన్న కోరికను నెరవేర్చింది. అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా తన ఫామ్‌ను కొనసాగించాడు. 17 టీ20ల్లో 33.43 సగటుతో,193.84 స్ట్రైక్ రేట్‌తో ఆడాడు... రెండు సెంచరీలు కూడా కొట్టాడు.
ఐపీఎల్ 2019కి ముందు ఢిల్లీ క్యాపిటల్స్ (అప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్) నుంచి ఎస్ఆర్‌హెచ్ అతన్ని కొనుగోలు చేసినప్పుడే అభిషేక్ టాలెంట్ కనిపించిందని విలియమ్సన్ గుర్తు చేసుకున్నాడు. అప్పటికి అతను మూడు ఐపీఎల్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ అతని టాలెంట్ మాత్రం అద్భుతమన్నాడు.
"కొన్నిసార్లు ఐపీఎల్‌లో ఒక యంగ్ ప్లేయర్ కోసం ఎక్కువ కాలం వెయిట్ చేయడం కష్టం. కానీ ఇప్పుడు అభిషేక్ ప్రపంచంలోనే డేంజరస్ టీ20 బ్యాటర్లలో ఒకడిగా ఎదుగుతున్నాడు.యువరాజ్ సింగ్ దగ్గర ఇలా చాలామంది కుర్రాళ్ళు ఉన్నారు" అని అన్నాడు.
"అతను చాలా సరదాగా ఉంటాడు. హ్యాపీగా గేమ్ ఆడతాడు. సూపర్ స్టార్ ఆటగాళ్లలో ఉండే కాన్ఫిడెన్స్ అతనిలో ఉంది. మంచి ట్రైనర్ యువరాజ్ వద్ద శిక్షణ పొందాడు. యువరాజ్ కూడా బంతిని వీలైనంత దూరం కొట్టడానికి ప్రయత్నించేవాడు. అభిషేక్ కూడా ఇలాగే చేస్తాడు' అని విలియమ్సన్ పేర్కోన్నాడు.