ఎవరీ విప్రాజ్ ,నిగమ్?
విశాఖపట్నం మైదానమే చిన్నబోయేలా బౌండరీలు బాది విప్రాజ్ నిగమ్ తన సత్తాను పరిచయం చేసాడు. చివర్లో బ్యాటింగ్ కు దిగిన ఇతడు కేవలం 15 బంతుల్లోనే 39 పరుగులు చేసాడు... ఇందులో 5 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి... అంటే బౌండరీతోనే 32 పరుగులు బౌండరీలతో వచ్చినవే. దీన్నిబట్టే నిగమ్ బ్యాటింగ్ ఎంత విధ్వంసకరంగా సాగిందో అర్ధం చేసుకోవచ్చు.
డిల్లీ క్యాపిటల్ తరపున ఐపిఎల్ 2025 లో ఆరంగేట్రం చేసాడు విప్రాజ్ నిగమ్. మొదటి మ్యాచ్ లోనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడి ఆటనుచూసి ప్రత్యర్థి బౌలర్లే భయపడిపోయారు... అంత విధ్వంసకరంగా సాగింది. అసలు గెలుపుపైనే నమ్మకంలేని స్థాయినుండి మరో 3 బంతులు మిగిలుండగానే డిల్లీ విజయం సాధించిందంటే అది విప్రాజ్ మెరుపు ఇన్నింగ్సే వల్లే సాధ్యమయ్యింది.
డిల్లీ విజయంలో కీలకంగా వ్యవహరించి విప్రాజ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఆల్ రౌండర్. ఇతడు మంచి స్పిన్నర్, మంచి హిట్టర్. అటు బ్యాట్, ఇటు బాల్ తో మ్యాజిక్ చేయగల విప్రాజ్ ను డిల్లీ కేవలం రూ.50 లక్షలకు సొంతం చేసుకుంది.
ఇతడు సయ్యద్ మస్తాన్ అలీ ట్రోఫీ 2024-25 లో అద్భుతంగా రాణించి డిల్లీ యాజమాన్యం కంట్లో పడ్డాడు. ఇతడు కేవలం 7 ఎకానమీతో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. అతడికి బ్యాటింగ్ అవకాశాలు ఎక్కువగా రాలేదు... ఆడిన ఒక్క మ్యాచ్ లోనూ ఎనిమిది బంతుల్లో 27 పరుగులు చేసాడు.