IPL 2025: విరాట్ కోహ్లీకి షాకిచ్చిన శుభ్‌మన్ గిల్

Published : May 19, 2025, 10:18 AM IST

Shubman Gill breaks Kohli record: ఐపీఎల్ 2025లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో శుభ్‌మన్ గిల్ 93* పరుగులు సూప‌ర్ నాక్ ఆడాడు. దీంతో టీ20ల్లో 5000 పరుగులు పూర్తి చేశాడు. ఈ క్ర‌మంలోనే స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు. 

PREV
15
శుభ్ మన్ గిల్ సూపర్ నాక్

Shubman Gill breaks Kohli record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత సాధించాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో 200 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో గిల్ 93* ప‌రుగుల సూప‌ర్ నాక్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్ తో టీ20 క్రికెట్ లో 5000 పరుగులను పూర్తి చేశాడు. ఈ ఘనతను గిల్ కేవ‌లం 154 ఇన్నింగ్స్‌ల్లో సాధించాడు.

25
విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన గిల్

ఈ విష‌యంలో విరాట్ కోహ్లీని గిల్ అధిగ‌మించాడు. 5వేల ప‌రుగుల కోసం విరాట్ కోహ్లీ 167 ఇన్నింగ్స్‌లు పట్టాయి. ఈ విష‌యంలో టాప్ లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. 5వేల ప‌రుగులను కేఎల్ రాహుల్ 143 ఇన్నింగ్స్‌లలో పూర్తి చేశాడు.

35
సూపర్ ఫామ్ లో శుభ్‌మన్ గిల్

గత కొన్నిసీజన్లుగా శుభ్‌మన్ గిల్ అద్భుత ఫార్మ్‌లో కొనసాగుతుండగా, ఈ సీజన్‌లో ఇప్పటివరకు 12 ఇన్నింగ్స్‌లలో ఆరు హాఫ్ సెంచ‌రీలు బాదాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌పై గిల్ 53 బంతుల్లో అజేయంగా 93 పరుగులు చేసి సాయి సుదర్శన్ (108 నాటౌట్) తో కలిసి 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ నష్టపోకుండా ఆరు బంతులు మిగిలుండగానే పూర్తి చేశాడు.

45
ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన గుజరాత్ టైటాన్స్

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. గుజ‌రాత్ తో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) లు కూడా ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించాయి. టాప్ ఫోర్ కోసం మూడు జ‌ట్లు అర్హ‌త సాధించ‌గా, ప్లేఆఫ్స్ చివ‌రి బెర్త్ కోసం ముంబై ఇండియ‌న్స్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిట‌ల్స్ పోటీ ప‌డుతున్నాయి.

55
గుజరాత్ టైటాన్స్ సూపర్ రికార్డు

ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ మ‌రో ఘ‌త‌న సాధించింది. ఐపీఎల్ లోమొట్టమొదటిసారి 200 లేదా అంతకంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా విజయవంతంగా చేధించిన ఘనతను గుజరాత్ టైటాన్స్ నమోదు చేసింది. అంతేకాదు, టీ20 క్రికెట్ చరిత్రలో ఇది రెండవసారి మాత్రమే ఈ విధంగా 200కి పైగా లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా చేధించిన సందర్భంగా నిలిచింది. అంత‌కుముందు, 2022లో పాకిస్తాన్ ఇంగ్లాండ్‌పై కరాచీలో 200 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా పూర్తి చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories