ఐపీఎల్ 2025 మధ్యలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో లీగ్‌ను ఒక వారం పాటు నిలిపివేయగా, ఆ సమయంలో చాలామంది విదేశీ క్రికెటర్లు తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. అందులో ఆస్ట్రేలియన్లు కూడా ఉన్నారు. అయితే, బీసీసీఐ టోర్నీ పునఃప్రారంభాన్ని ప్రకటించిన తర్వాత మిచెల్ స్టార్క్, జేక్ ఫ్రేసర్-మర్క్ లాంటి ఆటగాళ్లు మిగతా మ్యాచ్‌లకు దూరంగా ఉండగా, ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్, కగిసో రబాడా, ట్రిస్టన్ స్టబ్‌లు తమ జట్లకు తిరిగి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు.