Nicholas Pooran. (Photo- IPL)
Nicholas Pooran breaks Virender Sehwag and Chris Gayle's records: ఐపీఎల్ లోకి మరో క్రిస్ గేల్ వచ్చినట్టున్నాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ లతో పరుగుల సునామీ రేపుతున్నాడు. అతనే వెస్టిండీస్ స్టార్ బ్యాటర్, ఐపీఎల్ లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న 29 ఏళ్ల నికోలస్ పూరన్. గత సీజన్ లో దుమ్మురేపే ఇన్నింగ్ లు ఆడిన అతను ప్రస్తుత ఐపీఎల్ 2025లో కూడా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు.
లక్నో సూపర్ జెయింట్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2025 21వ మ్యాచ్‌లో కూడా పూరన్ విధ్వంసం సృష్టించాడు. కేకేఆర్ బౌలింగ్ చీల్చిచెండాడు. ఈ క్రమంలోనే టీమిండియా ఢాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ లను దాటేశాడు.
Nicholas Pooran (Photo: IPL)
నికోలస్ పూరన్ కేకేఆర్ పై సెంచరీ మిస్ అయ్యాడు కానీ, ఫోర్లు, సిక్సర్లతో అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్ లో మూడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన పూరన్ కేవలం 36 బంతుల్లోనే 87 పరుగులు అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. 241 స్ట్రైక్ రేట్‌తో సాగిన అతని బ్యాటింగ్ నుంచి 7 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు వచ్చాయి.
Nicholas Pooran
సెహ్వాగ్, గేల్ రికార్డులు బద్దలు కొట్టిన నికోలస్ పూరన్
నికోలస్ పూరన్ ఈ మ్యాచ్ లో ఆడిన సూపర్ నాక్ తో ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసి వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్ రికార్డులను బద్దలు కొట్టాడు. అతను కేవలం 1198 బంతుల్లోనే 2000 ఐపీఎల్ పరుగులను సాధించాడు. ఇది ఐపీఎల్ చరిత్రలో రెండవ వేగవంతమైనది.
ఈ విషయంలో సెహ్వాగ్, గేల్, రిషబ్ పంత్, గ్లెన్ మ్యాక్స్ వెల్ ను పూరన్ దాటేశాడు. సెహ్వాగ్ 1211 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేయగా, గేల్ 1251 బంతుల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన రికార్డు ఆండ్రీ రస్సెల్ పేరిట ఉంది. అతను కేవలం 1120 బంతుల్లో 2000 పరుగులు అందుకున్నాడు.
Nicholas Pooran (Photo: @iplX)
ఐపీఎల్‌లో బంతుల పరంగా అత్యంత వేగంగా 2000 పరుగులు సాధించిన టాప్-5 ప్లేయర్లు
1120 బంతులు - ఆండ్రీ రస్సెల్
1198 బంతులు - నికోలస్ పూరన్
1211 బంతులు - వీరేంద్ర సెహ్వాగ్
1251 బంతులు - క్రిస్ గేల్
1306 బంతులు - రిషబ్ పంత్
1309 బంతులు - గ్లెన్ మాక్స్‌వెల్
Nicholas Pooran
కేకేఆర్ పై ఎల్ఎస్జీ థ్రిల్లింగ్ విక్టరీ
ఈ మ్యాచ్ లో మిచెల్ మార్ష్ (81 పరుగులు), నికోలస్ పూరన్ (87 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతూ 71 పరుగుల భాగస్వామ్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ అందించాడు. ఐడెన్ మార్క్రామ్ కూడా సూపర్ నాక్ ఆడాడు. దీంతో లక్నో టీమ్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది.
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ 234/7 పరుగులు చేసి 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. కేకేఆర్ బ్యాటింగ్ లో అజింక్య రహానే 61, వెంకటేష్ అయ్యర్ 45, రింకూ సింగ్ 38*, సునీల్ నరైన్ 30 పరుగులు ఇన్నింగ్స్ లను ఆడారు.