IPL 2025:1 ఓవర్ లో 11 బంతులు వేసిన శార్దుల్ ఠాకూర్.. ఎందుకు?

IPL 2025 PBKS vs CSK: ఐపీఎల్ 2025 21వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఓడించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో 4 పరుగుల తేడాతో ఎల్ఎస్జీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాట్స్‌మెన్లు ప‌రుగుల వ‌ర‌దపారించారు. ఇరు జ‌ట్ల బౌలింగ్ ను దంచికొట్టారు. అయితే, ఈ మ్యాచ్ లో శార్థుల్ ఠాగూర్ ఒక ఓవ‌ర్ లో ఏకంగా 11 బంతులు వేశాడు. ఒక ఓవర్ కు 6 బంతులే కదా.. మరి ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. 

IPL 2025 PBKS vs CSK : 11 balls in 1 over... Shardul Thakur did something against KKR, fans could not believe it in telugu rma
Shardul Thakur and Aiden Markram (Photo: IPL)

IPL 2025 PBKS vs CSK: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ఉత్కంఠ‌భ‌రితంగా ముందుకు సాగుతోంది. ప‌లువురు బ్యాట‌ర్లు సూప‌ర్ బ్యాటింగ్ తో అద‌ర‌గొడుతున్నారు. బౌల‌ర్లు సైతం తాము త‌క్కువ కాదంటూ మెరుపు బంతులు, స్పిన్ మాయాజాలంతో బ్యాట‌ర్ల‌ను పెవిలియ‌న్ కు పంపుతున్న సంద‌ర్బాలు ఉన్నాయి. అయితే, మొత్తంగా చూస్తే ఐపీఎల్ లో ఇప్ప‌టివ‌ర‌కు కొద్దిగా బ్యాట‌ర్ల‌దే పై చేయిగా ఉంది. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్-ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ్యాచ్ తో మ‌రోసారి ఇది రుజువైంది. ఇరుజ‌ట్లు క‌లిపి 40 ఓవ‌ర్ల‌లో ఏకంగా 450+ ప‌రుగులు కొట్టాయి. 

Shardul Thakur. (Photo- IPL)

అయితే, ఈ ఐపీఎల్ 2025 21వ మ్యాచ్‌లో కోల్‌కతాను లక్నో టీమ్ ఓడించింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో 4 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్ల బ్యాట్స్‌మెన్ చాలా పరుగులు సాధించారు. ఈడెన్ గార్డెన్స్ బౌలర్లకు చుక్క‌లు చూపించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 472 పరుగులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే ల‌క్నో బౌల‌ర్  శార్దూల్ ఠాకూర్ మ‌రోసారి హాట్ టాపిక్ గా మారాడు. అత‌ను త‌న బౌలింగ్ లో ఏకంగా 11 బంతులు వేశాడు. 


Lucknow Super Giants' Shardul Thakur

ఒక ఓవ‌ర్ కు సాధార‌ణంగా 6 బంతులు వుంటాయి. కానీ, శార్దూల్ ఠాకూర్ ఒకే ఓవర్లో ఐదు వైడ్ బంతులతో కలిపి మొత్తం 11 బంతులు వేశాడు. మ్యాచ్ 13వ ఓవర్లో శార్దూల్ మొదటి ఐదు బంతుల్లో వరుసగా ఐదు వైడ్లు వేశాడు, కెప్టెన్ రిషబ్ పంత్ స్పష్టంగా నిరాశ చెందాడు. ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు గొప్ప ఫామ్‌లో ఉన్న ఈ ఫాస్ట్ బౌలర్, ఆ ఓవర్‌లో త‌న బౌలింగ్ లయను కోల్పోయాడు. కానీ, ఓవ‌ర్ లో బంతులు పెరుగుతున్న నిరుత్సాహపడకుండా ఈ 11 బంతుల ఓవ‌ర్ లో చివ‌ర‌లో అద్భుత‌మైన డెలివరీతో కేకేఆర్ కెప్టెన్ ను పెవిలియ‌న్ కు  పంపాడు. ఈ వికెట్ మ్యాచ్ గ‌మ‌నాన్ని పూర్తిగా మార్చివేసింది.

ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ 4 ఓవర్లలో 52 పరుగులు ఇచ్చాడు కానీ, రెండు కీల‌క‌మైన బిగ్ వికెట్లు కూడా తీసుకున్నాడు. పరుగుల సునామీ వ‌చ్చిన ఈ మ్యాచ్‌లో అజింక్య రహానే, ఆండ్రీ రస్సెల్ వికెట్లు పడగొట్టి శార్దూల్ మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 5 మ్యాచ్‌ల్లో అతను 9 వికెట్లు పడగొట్టాడు.

ఐపీఎల్ వేలంలో శార్దూల్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. మొహ్సిన్ ఖాన్ గాయపడిన తర్వాత అతను లక్నో జట్టులో ప్రత్యామ్నాయంగా చేరాడు. త‌న బౌలింగ్ ఏవేవో చేసినా మొత్తంగా ఒక్క‌టైనా అద్భుత‌మైన డేలివ‌రీ వేసి వికెట్లు తీసుకుంటూ జ‌ట్టు విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషిస్తూనే ఉన్నాడు. 

ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఈ మ్యాచ్ లో కోల్ కతా కెప్టెన్ అజింక్య రహానే టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్లకు 238 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 234 పరుగులు చేసింది. కేవ‌లం 4 ప‌రుగులు తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో కోల్‌కతాకు ఇది మూడో ఓట‌మి. ల‌క్నో టీమ్ మూడో విజ‌యాన్ని అందుకుంది. 

Latest Videos

vuukle one pixel image
click me!