Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL
Shubman Gill : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. ఈ స్టైలిష్ కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ వేదికపై 1000 పరుగులు చేసిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఈ ఘనతను సాధించడానికి గిల్‌కు ఇంకా 14 పరుగులు మాత్రమే అవసరమైన సమయంలో 38 పరుగులు ఇన్నింగ్స్ ను ఆడి ఈ ఘనత సాధించాడు.
Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL
నరేంద్ర మోడీ స్టేడియంలో గిల్ అద్భుతమైన రికార్డులు కలిగి ఉన్నాడు. ఇక్కడ 20 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేసి మూడు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు సాధించి తన బ్యాట్ పవర్ ను చూపించాడు. మ్యాచ్ గిల్-సుదర్శన్ గుజరాత్ టైటాన్స్ కు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. పవర్ ప్లేలో స్కోరును 66 చేర్చారు. ఇది సీజన్ లో వికెట్ పడకుండా సాగిన తొలి ఇన్నింగ్స్ పవర్ ప్లేగా నిలిచింది. అయితే, తొమ్మిదవ ఓవర్లో గిల్ ను ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుట్ చేశాడు. 27 బంతుల్లో 38 పరుగుల గిల్ ఇన్నింగ్స్ లో ఒక సిక్స్, నాలుగు బౌండరీలు బాదాడు.
Shubman Gill becomes first player to create massive record in Ahmedabad clash in IPL
ఈ మ్యాచ్ లో గిల్ ఒకే వేదికలో 1000 పరుగులు పూర్తి చేయడంతో పాటు అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన రెండో ప్లేయర్ గా కూడా నిలిచాడు. కేవలం 20 ఇన్నింగ్స్‌లలోనే గిల్ ఒకే వేదికపై వేయి పరుగులు పూర్తి చేశాడు. అంతకుముందు బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో 19 ఇన్నింగ్స్‌లలో క్రిస్ గేల్ 1000 పరుగులు పూర్తి చేసి టాప్ లో కొనసాగుతున్నాడు. అలాగే, ఈ లిస్టులో ఉన్న డేవిడ్ వార్నర్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో 22 ఇన్నింగ్స్‌లలో 1000 పరుగుల ఈ మైలురాయిని చేరుకుని మూడో స్థానంలో నిలిచాడు. మొహాలీలో 26 ఇన్నింగ్స్‌లలో షాన్ మార్ష్ 1000 పరుగులు పూర్తి చేసి తర్వాతి స్థానంలో ఉన్నాడు.
Top-5 players who have completed 1000 IPL runs at one venue
ఒక వేదికలో 1000 ఐపీఎల్ పరుగులు పూర్తి చేసిన టాప్-5 ప్లేయర్లు
1.క్రిస్ గేల్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 19 ఇన్నింగ్స్‌లు
2. శుభ్‌మన్ గిల్: నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్ - 20 ఇన్నింగ్స్‌లు
3. డేవిడ్ వార్నర్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ - 22 ఇన్నింగ్స్‌లు
4. షాన్ మార్ష్: పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, మొహాలి - 26 ఇన్నింగ్స్‌లు
5. సూర్యకుమార్ యాదవ్: వాంఖడే స్టేడియం, ముంబై - 31 ఇన్నింగ్స్‌లు
Top-5 players who have scored the most runs in a single venue in the IPL
ఐపీఎల్ లో ఒకే వేదికలో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు
1.విరాట్ కోహ్లీ: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 3040+ పరుగులు
2. రోహిత్ శర్మ: వాంఖడే స్టేడియం, ముంబై - 2295+ పరుగులు
3. ఏబీ డివిలియర్స్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 1960+ పరుగులు
4. డేవిడ్ వార్నర్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం, హైదరాబాద్ - 1623+ పరుగులు
5. క్రిస్ గేల్: ఎం. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు - 1561+ పరుగులు