IPL 2025: చెన్నై కెప్టెన్ గా ధోని.. ఐపీఎల్ జట్లకు ఇక దబిడి దిబిడే !

IPL 2025 CSK: రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా ఐపీఎల్ 2025కి దూరం కావ‌డంతో చెన్నై సూపర్ కింగ్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. గైక్వాడ్ లేక‌పోవ‌డంతో ఎంఎస్ ధోని మ‌ళ్లీ సీఎస్కే కెప్టెన్ గా తిరిగివ‌చ్చాడు. ధోని నాయకత్వంలో  చెన్నై సూప‌ర్ కింగ్స్  2010, 2011, 2018, 2021, 2023లో ఐపీఎల్ టైటిళ్ల‌ను సాధించింది. ధోని కెప్టెన్సీలో మ‌రోసారి అదే జోరును కొన‌సాగించాల‌ని సీఎస్కే భావిస్తోంది.
 

IPL 2025: MS Dhoni to lead CSK,  Ruturaj Gaikwad ruled out in telugu rma
MS Dhoni to lead CSK

MS Dhoni to lead CSK: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) 2025 ఉత్కంఠ‌గా సాగుతున్న స‌మ‌యంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా ఈ మెగా టోర్నమెంట్‌కు దూరమయ్యాడు. దీంతో చెన్నై టీమ్ కు మ‌రో పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. 

IPL 2025: MS Dhoni to lead CSK,  Ruturaj Gaikwad ruled out in telugu rma
MS Dhoni

అయితే, మోచేయి గాయం కార‌ణంగా రుతురాజ్ దూరం కావ‌డంతో ధోని ఫ్యాన్స్ సూప‌ర్ గుడ్ న్యూస్ అందింది. ధోని ఫ్యాన్స్ కే కాదు చెన్నై సూప‌ర్ కింగ్స్ అభిమానుల‌కు కూడా ఇది శుభ‌వార్తే. ఎందుకంటే రుతురాజ్ చెన్నై టీమ్ దూరం కావ‌డంతో అత‌ని స్థానంలో ధోని మ‌ళ్లీ సీఎస్కే కెప్టెన్సీ బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. 


అవును మ‌ళ్లీ చెన్నై టీమ్ ను ధోని ముందుకు న‌డిపించ‌నున్నాడు. ఐపీఎల్ లో మోస్ట్ స‌క్సెస్ ఫుల్ కెప్టెన్ ధోని. అత‌ని నాయ‌క‌త్వంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియ‌న్ గా నిలిచింది. ధోని అద్భుత‌మైన ఆట‌తో పాటు సూప‌ర్ కెప్టెన్సీతో చెన్నై టీమ్ కు 2010, 2011, 2018, 2021, 2023 ఎడిష‌న్ల‌లో ఐపీఎల్ టైటిళ్ల‌ను గెలిపించాడు. వీటితో పాటు రెండు ఛాంపియన్స్ లీగ్ ట్రోఫీలను కూడా అందించాడు. 

Ravichandran Ashwin and MS Dhoni

ఐపీఎల్ 2025లో ఇప్ప‌టివ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్ర‌ద‌ర్శ‌న అంత గొప్పగా లేదు. రుతురాజ్ కెప్టెన్సీలో సీఎస్కే ఆడిన మొదటి ఐదు మ్యాచ్‌ల్లో ఒకే ఒక్క విజయం సాధించింది. నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. చెన్నై టీమ్ ఐపీఎల్ 2025 పాయింట్ల  పట్టికలో 9వ స్థానంలో ఉంది. సీఎస్కే కంటే దిగువ స్థానంలో  సన్‌రైజర్స్ హైదరాబాద్ జ‌ట్టు ఒక్క‌టే ఉంది. 

MS Dhoni

జ‌ట్టులో కెప్టెన్సీ మార్పు గురించి సీఎస్కే ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం తీవ్రంగా ఉంది. అత‌ను చాలా బాధ‌లో ఉన్నాడు. అందుకే ఇప్పుడు అత‌ని స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయ‌ర్ గా ఆడుతున్న ఎంఎస్ ధోని చెన్నై టీమ్ ను  ముందుకు న‌డిపిస్తాడు. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచ్‌లకు కెప్టెన్ గా ఉంటాడని తెలిపాడు.

MS Dhoni. (Photo- IPL)

ధోని చెన్నై సూపర్ కింగ్స్ కోసం అద్భుతమైన ఇన్నింగ్స్ లతో పాటు తనదైన సూపర్ కెప్టెన్సీతో అనేక విజయాలు అందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ కోసం అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా కొనసాగుతున్నాడు.

2024 సీజన్ కు ముందు ధోని తన కెప్టెన్సీని వదులుకుని రుతురాజ్ గైక్వాడ్ కు అప్పగించాడు. అప్పటి నుంచి చెన్నై టీమ్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ గా కొనసాగుతున్నాడు. 2025లో ప్లేయర్ గానే చెన్నై తరఫున గ్రౌండ్ లోకి దిగిన ధోని.. ఇప్పుడు కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగే ఐపీఎల్ 25వ మ్యాచ్ తో కెప్టెన్ గా అడుగుపెట్టబోతున్నాడు.

Latest Videos

vuukle one pixel image
click me!