ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్! ఓటమి తర్వాత ఆ జట్టు కష్టాల్లో పడింది !

Published : Apr 22, 2025, 07:15 PM IST

IPL 2025 Match Fixing: ఐపీఎల్ 2025 ఉత్కంఠగా సాగుతోంది. సగానికి చేరిన ఈ మెగా క్రికెట్ లీగ్ మధ్యలో ఒక జట్టుపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనంగా మారాయి. ఎందుకంటే దాదాపు గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడమే దీనికి ప్రధాన కారణం. నిజంగానే మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా? ఎందుకు ఈ ఆరోపణలు వస్తున్నాయి?  ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్! ఓటమి తర్వాత ఆ జట్టు కష్టాల్లో పడింది !

IPL 2025 match-fixing: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ సగం దాటింది. ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ 2025 లో ఇప్పటివరకు  39 మ్యాచ్‌లు జరిగాయి. భారీ అంచనాలున్న టీమ్స్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది. అంచనాలు లేని జట్లు అదరగొడుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ అదరగొడుతున్నాయి. కోల్‌కతా, ముంబై కూడా ప్లేఆఫ్స్ రేసులో ఉన్నాయి. వరుస ఓటములతో చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ పరిస్థితి దారుణంగా ఉంది. అయితే, ఇప్పుడు 'మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు' సంచలనంగా మారాయి.

25
IPL 2025 Match Fixing Allegations Against Rajasthan Royals After Loss to Lucknow Super Giants

 గెలిచే మ్యాచ్ లో ఓడిపోవడంతోనే ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వస్తున్నాయి. ఐపీఎల్ 2025 36వ మ్యాచ్ లో లక్నో- రాజస్థాన్ జట్లు తలపడ్డాయి.  ఈ మ్యాచ్ లో లక్నో 180 పరుగులు చేసింది. రాజస్థాన్ దాదాపు గెలిచేసింది. వైభవ్, యశస్వి అర్ధశతకాలు చేశారు.

చివరి ఓవర్లో 9 పరుగులు కావాలి. ఇంకా  6 వికెట్లు చేతిలో ఉన్నాయి. కానీ, లక్నో బౌలర్ ఆవేష్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 పరుగుల తేడాతో తన జట్టును గెలిపించాడు. అయితే, రాజస్థాన్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు నెటిజన్లు.

35
IPL 2025 Match Fixing

రాజస్థాన్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడిందాం అంటూ సోషల్ మీడియా వేదికగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  ఎందుకంటే ఈ మ్యాచ్ లో 6 వికెట్లు చేతిలో ఉన్న చివరి ఓవర్ లో 9 పరుగులు చేయలేకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ 180/5 పరుగులు చేసింది. సెకండ్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ రాయల్స్ 178/5 పరుగులు చేసింది. 

 

45
IPL 2025 Match Fixing Allegations Against Rajasthan Royals

గతంలోనూ ఆర్ఆర్‌పై ఆరోపణలు

జైదీప్ బిహానీ ఆర్ఆర్ మేనేజ్‌మెంట్‌ని ప్రశ్నించారు. 2013లో రాజస్థాన్ ఆటగాళ్ళు మ్యాచ్ ఫిక్సింగ్‌లో ఇరుక్కున్నారు. జైదీప్ ప్రకారం, ఫ్రాంచైజీ అధినేత రాజ్ కుంద్రా కూడా దీనిలో ఉన్నారు. దీంతో జట్టుపై రెండేళ్ళు నిషేధం పడింది. బీసీసీఐ మళ్ళీ విచారణ జరపాలని ఆయన కోరారు. 2016, 17 సీజన్లలో సీఎస్కే, ఆర్ఆర్ జట్లపై నిషేధం పడింది.

55
IPL 2025 Match Fixing Allegations Against Rajasthan

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఎలా ఉందంటే? 

ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ 8 మ్యాచ్ లు ఆడి కేవలం 2 మ్యాచ్ లను మాత్రమే గెలుచుకుంది. మిగతా 6 మ్యాచ్ లలో ఓడిపోయింది. 4 పాయింట్లతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది. రాజస్థాన్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగతా 6 మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories