KKR star Quinton de Kock breaks Manish Pandey's IPL final record
Quinton de Kock breaks Manish Pandey's IPL final record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న క్వింటన్ డి కాక్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ తరపున ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు.
గౌహతిలోని బర్సపర క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో క్వింటన్ డి కాక్ 97 పరుగుల అజేయంగా ఇన్నింగ్స్ లో నైట్ రైడర్స్ జట్టుకు విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్ తో రాజస్థాన్ పై 152 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ ఈజీగానే ఛేదించింది.
KKR star Quinton de Kock breaks Manish Pandey's IPL final record
ఈ మ్యాచ్ లో డి కాక్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ రాజస్తాన్ బౌలర్లను చిత్తుచేశాడు. అతను 61 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 97 పరుగులు అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. సౌతాఫ్రికాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ కు మరో మూడు పరుగులు అయితే సెంచరీ సాధించేవాడు, కానీ అప్పటికే టార్గెట్ పూర్తయింది. ఈ సీజన్ లో కేకేఆర్ కు తొలి విజయాన్ని అందించాడు.
అయితే, తన 97 పరుగుల ఇన్నింగ్స్ తో క్వింటన్ డికాక్ మరో రికార్డు సాధించాడు. 2014లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (ఇప్పుడు పంజాబ్ కింగ్స్)తో జరిగిన ఫైనల్‌లో మనీష్ పాండే సాధించిన రికార్డును బద్దలు కొట్టాడు. ఈ వికెట్ కీపర్ చేసిన 97 పరుగులు ఇప్పుడు రన్-ఛేజింగ్‌లో KKR తరపున ఆడిన అతిపెద్ద ఇన్నింగ్స్ గా నిలిచింది. ఈ మ్యాచ్ లో మనీష్ పాండే 94 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు.
KKR star Quinton de Kock breaks Manish Pandey's IPL final record
రన్-ఛేజింగ్‌లలో కేకేఆర్ తరపున అత్యధిక స్కోరు:
1 - క్వింటన్ డి కాక్: 2025లో 97* vs RR
2 - మనీష్ పాండే: 2014లో KXIP (ఇప్పుడు PBKS) పై 94 పరుగులు
3 - క్రిస్ లిన్: 2017లో GL తో జరిగిన మ్యాచ్ లో 93* పరుగులు
4 - మన్వీందర్ బిస్లా: 2013లో CSK పై 92 పరుగులు
5 - గౌతమ్ గంభీర్: 2016లో 90* vs SRH
మ్యాచ్ గెలిచే ఇన్నింగ్స్ ఆడిన క్వింటన్ డి కాక్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తన ఇన్నింగ్స్ పై డికాక్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ రిటైర్మెంట్ తర్వాత స్కోరు చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. "నాకు అవకాశం లభించడం ఆనందంగా ఉంది, దానిని ఉపయోగించుకోవాలనుకున్నాను. ఇలాంటి ఇన్నింగ్స్ రావడం ఆనందం కలిగిస్తోంది" అని డి కాక్ మ్యాచ్ తర్వాత ప్రెజెంటేషన్ లో అన్నారు.