అలాగే, ఐపీఎల్ చరిత్రలో మూడు జట్లకు నాయకత్వం వహించిన 4వ క్రికెటర్ గా అయ్యర్ నిలిచాడు. అంతకుముందు మహేల జయవర్ధనే ఈ రికార్డును సృష్టించిన తొలి ప్లేయర్ గా ఉన్నాడు. అతని తర్వాత కుమార్ సంగక్కర, స్టీవ్ స్మిత్ ఉన్నారు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అయ్యర్ అద్భుతమైన ఆటను మ్యాచ్ చివరివరకు కొనసాగించాడు.
27 బంతుల్లో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మ్యాచ్ 14వ ఓవర్‌లో రషీద్ ఖాన్ బౌలింగ్ తో అద్భుతమైన సిక్సర్ తో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ లో అయ్యర్ కు ఇది 28వ హాఫ్ సెంచరీ. అలాగే, ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు సాధించిన రెండో కెప్టెన్ గా నిలిచాడు.
ఒక ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు
119 - సంజు శాంసన్ RR vs PBKS, వాంఖడే, 2021
99* - మయాంక్ అగర్వాల్ PBKS vs DC, అహ్మదాబాద్, 2021
97* - శ్రేయాస్ అయ్యర్ PBKS vs GT, అహ్మదాబాద్, 2025*
93* - శ్రేయాస్ అయ్యర్ DC vs KKR, ఢిల్లీ, 2018
88 - ఫాఫ్ డు ప్లెసిస్ RCB vs PBKS, ముంబై, 2022