IPL 2025, GT vs PBKS: ప్రియాంష్ ఆర్య పరుగుల తుఫాను మొదలు పెడితే శ్రేయాస్ అయ్యర్ దానిని సునామీగా మార్చాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ తన ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను సాధించాడు.
Gujarat Titans vs Punjab Kings: ఇదేంది భయ్యా ఇలా దంచికొడుతున్నారు. ఐపీఎల్ అంటే అదిరిపోవాల్సిందే అనేలా పంజాబ్ బ్యాటర్లు తొలి మ్యాచ్ నుంచే వీర బాదుడు మొదలు పెట్టారు. మరీ ముఖ్యంగా పరుగల వర్షం, బ్యాటింగ్ విధ్వంసం, క్రికెట్ లో సునామీ అంటే ఏంటో చూపించాడు శ్రేయాస్ అయ్యర్. సిక్సర్ల వర్షం కురిపించాడు. గుజరాత్ బౌలింగ్ ను దంచికొడుతూ తన ఐపీఎల్ కెరీర్ లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ను నమోదుచేశాడు.
24
Satish Menon, Ricky Ponting, and Shreyas Iyer (Photo: PBKS)
ఛాంపియన్ ప్లేయర్ ను వదులుకున్న కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఎంత విలువైన ప్లేయర్ ను వదులుకుందో తన బ్యాట్ తో చూపించాడు. ఐపీఎల్ లో ఫ్రాంఛైజీ మరిన తర్వాత అద్భుతమైన ఆటతో తన ఐపీఎల్ కెరీర్ లో తొలి అత్యధిక స్కోర్ ను నమోదుచేశాడు. టీమ్ కోసం తన సెంచరీని కూడా వదులుకుని సెల్ఫ్ లెస్ కెప్టెన్ అని మరోసారి నిరూపించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 5వ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ vs పంజాబ్ కింగ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ టీమ్ బ్యాటర్లు దంచికొట్టారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భుతమైన బ్యాటింగ్ లో పంజాబ్ టీమ్ 243/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. శ్రేయాస్ అయ్యర్ తన తన తుఫాన్ ఇన్నింగ్స్ లో సిక్సర్ల మోత మోగించాడు. 42 బంతుల్లో 97 పరుగుల ఇన్నింగ్స్ తో దుమ్మురేపాడు. ఐపీఎల్ గల్లీ క్రికెట్ లా మార్చేస్తూ తన సునామీ ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 9 సిక్సర్లతో గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ను శ్రేయాస్ అయ్యర్ దంచికొట్టాడు.
34
తన ఈ సూపర్ ఇన్నింగ్స్ తో శ్రేయాస్ అయ్యర్ పలు రికార్డుల మోత మోగించాడు. టీ20 క్రికెట్‌లో 6,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 2024లో కేకేఆర్ ను చాంపియన్ గా నిలబెట్టిన శ్రేయాస్ అయ్యర్.. గుజరాత్ పై భారీ ఇన్నింగ్స్ తో టోర్నమెంట్‌లో 2,000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఐపీఎల్ కెప్టెన్‌ల ఎలైట్ జాబితాలో చేరాడు.
2015లో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్.. 2021 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో భాగంగా ఉన్నాడు. ఆ తరువాత కోల్‌కతా నైట్ రైడర్స్‌లోకి వెళ్లాడు. ఐపీఎల్ 2024లో కేకేఆర్ ను ఛాంపియన్ గా నిలబెట్టాడు. కేకేఆర్ ను మూడో ఐపీఎల్ టైటిల్ ను గెలుచుకోవడంలో ప్లేయర్ గా, కెప్టెన్ గా కీలక పాత్ర పోషించాడు.
44
ఐపీఎల్‌లో ఇప్పటివరకు 117 మ్యాచ్‌లు ఆడి శ్రేయాస్ అయ్యర్ 127.47 స్ట్రైక్ రేట్‌తో 3127 పరుగులు చేశాడు. 2025లో అతను పంజాబ్ కింగ్స్‌లో చేరాడు. ప్రారంభ మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. ఐపీఎల్ లో 2000 పరుగులు సాధించిన ఏడవ ఐపీఎల్ కెప్టెన్ అయ్యాడు. అలాగే, విరాట్ కోహ్లీ , ఎంఎస్ ధోని , రోహిత్ శర్మ, డేవిడ్ వార్నర్ లతో కూడిన ఈ ఎలైట్ గ్రూప్ లో చేరాడు. ఫ్రాంచైజీకి కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోరు చేసిన మూడో ప్లేయర్ గా అయ్యర్ నిలిచాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్ సూపర్ నాక్ తో నరేంద్ర మోడీ స్టేడియంలో రెండో అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా పంజాబ్ నిలిచింది.