IPL 2025 GT vs LSG: గుజరాత్ టైటాన్స్ కు బిగ్ షాక్.. గిల్ టీమ్ కు టాప్ ప్లేస్ కష్టమే !

Published : May 23, 2025, 12:34 AM IST

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటన్స్ ఓటమిపాలైంది. దీంతో టాప్ ప్లేస్ దక్కించుకోవాలనే గిల్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది.

PREV
15
గుజరాత్ టైటన్స్‌కు పెద్ద దెబ్బ

IPL 2025 GT vs LSG : ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటన్స్‌కు పెద్ద దెబ్బ తగిలింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 33 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో గుజరాత్ జట్టు, ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టాప్ 2లో నిలిచే అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

25
శుభ్‌మన్ గిల్ టీమ్ టార్గెట్ ను అందుకోలేకపోయింది

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 64వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడ్డాయి. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ నిరాశజనక ప్రదర్శన చేసింది.

35
ఐపీఎల్ లో మిచెల్ మార్ష్ తొలి సెంచరీ

ముందుగా బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఆరంభంలో ఐడేన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ లు మంచి ఇన్నింగ్స్ లో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఆస్ట్రేలియా ఆటగాడు మార్ష్, తన తొలి ఐపీఎల్ సెంచరీని బాదాడు. 117 పరుగులు చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. అతడితో పాటు నికోలస్ పూరన్ 27 బంతుల్లో 56 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా లక్నో జట్టు 20 ఓవర్లలో 235/2 భారీ స్కోరు నమోదు చేసింది.

ఇదివరకు సీజన్‌లో అద్భుతంగా రాణించిన గుజరాత్ బౌలింగ్ విభాగం, ఈ మ్యాచ్‌లో పూర్తిగా విఫలమైంది. ఎలాంటి వ్యూహాలు పనిచేయకపోవడం లక్నో టీమ్ భారీ స్కోర్ సాధించింది.

45
సాయి సుదర్శన్ తన బ్యాట్ మ్యాజిక్ చూపించలేకపోయాడు

భారీ టార్గెట్ లో సెకండ్ బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ కు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్ జోడీ మంచి ఆరంభం అందించింది. కానీ సాయి సుదర్శన్ త్వరగా అవుటవ్వడంతో ఒత్తిడి గిల్‌పై పెరిగింది. గిల్ (35 పరుగులు) జోస్ బట్లర్ (33 పరుగులు) చేసి పెవిలియన్ కు చేరారు. దీంతో గుజరాత్ జట్టు కష్టాల్లో పడింది.

55
లక్నోకు చెమటలు పట్టించిన షెర్ఫేన్ రూథర్ ఫర్డ్, షారుఖ్ ఖాన్

షెర్ఫేన్ రూథర్ ఫర్డ్ 38 పరుగులు, షారుక్ ఖాన్ 57 పరుగుల ఇన్నింగ్స్ తో గుజరాత్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. కొంత సమయం లక్నో టీమ్ ను టెన్షన్ పెట్టారు. అయితే, రూథర్ ఫర్డ్ అవుట్ అయిన తర్వాత గుజరాత్ కోలుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 202 పరుగులు మాత్రమే చేసింది. 33 పరుగుల తేడాతో జీటీ ఓడిపోయింది.

ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించడం గుజరాత్‌కు అత్యంత కీలకంగా మారింది. ఈ విజయంతోనే వారు టాప్ 2లో స్థానం దక్కించుకునే అవకాశాన్ని నిలబెట్టుకోగలరు. ఓడితే టాప్-3 ప్లేస్ లోకి రావచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories