Mitchell Marsh: ఐపీఎల్ లో తొలి సెంచరీ సాధించిన మిచెల్ మార్ష్

Published : May 22, 2025, 09:25 PM IST

IPL 2025 GT vs LSG: ఐపీఎల్ 2025 జీటీ vs ఎల్ఎస్జీ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోటీమ్ పరుగుల వరద పారించింది. మిచెల్ మార్ష్ సెంచరీతో దుమ్మురేపాడు.

PREV
15
IPL 2025: గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్‌

IPL 2025 GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 64వ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ - లక్నో సూపర్ జెయింట్స్‌ తలపడ్డాయి. శుభ్ మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. 

25
లక్నో ధనాధన్ ఇన్నింగ్స్

మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో టీమ్ గుజరాత్ బౌలింగ్ ను దంచికొట్టింది. ఫోర్లు, సిక్సర్లతో పరుగుల వర్షం కురిపించింది. ఓపెనర్లు ఐడేన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ లు సూపర్ నాక్ లతో లక్నో టీమ్ భారీ స్కోర్ చేసింది.

35
ఐపీఎల్ లో తొలి సెంచరీ కొట్టిన మిచెల్ మార్ష్

ఐపీఎల్ 2025 లో సూపర్ ఫామ్ లో ఉన్న లక్నో స్టార్ బ్యాటర్ మిచెల్ మార్ష్ అద్భుతమైన ఇన్నింగ్స్ లతో అదరగొడుతున్నాడు. అహ్మదాబాద్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఫోర్లు, సిక్సర్లు బాదుతూ పరుగుల సునామీ రేపాడు. 

తన ఐపీఎల్ కెరీర్ లో తొలి సెంచరీ కొట్టాడు. 56 బంతుల్లో తన ఐపీఎల్ సెంచరీని పూర్తి చేశాడు. తన సెంచరీ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, 6 సిక్సర్లు బాదాడు. తన టీ20 కెరీర్ లో ఇది రెండో సెంచరీ. 117 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. 

45
నికోలస్ పూరన్ సునామీ నాక్

మరోసారి నికోలస్ పూరన్ సూపర్ నాక్ ఆడాడు. 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. సీజన్‌లో అత్యధిక సార్లు 25 లేదా అంతకంటే తక్కువ బంతుల్లో 50 పరుగులు ఎక్కువ సార్లు చేసిన ప్లేయర్ గా నికోలస్ పూరన్ ఘనత సాధించాడు. ఇప్పటివరకు ఐదు సార్లు 25 బంతుల్లోనే నికోలస్ పూరన్ హాఫ్ సెంచరీలు కొట్టాడు.

55
IPL 2025 GT vs LSG: భారీ స్కోర్ కొట్టిన లక్నో సూపర్ జెయింట్స్

 ఐడెన్ మార్క్రామ్ 24 బంతుల్లో 36 పరుగులు చేశాడు. మార్ష్ తో కలిసి ఐడెన్ మార్క్రామ్‌ను 91 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. లక్నో బ్యాటర్లలో మార్ష్ 117 పరుగులు, పూరన్ 56 పరుగులు, పంత్ 16 పరుగులు చేశారు. దీంతో ఎల్ఎస్జీ 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 235 పరుగులు చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories