చుక్కలు చూసిన బౌలర్లు :
ఒకే మ్యాచ్ లో మొత్తం 400+ పరుగులు వచ్చాయంటే బౌలర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అటు విజయం సాధించిన డిల్లీ బౌలర్లు గానీ... ఓటమిపాలైన లక్నో బౌలర్లుగానీ మ్యాచ్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. హేమాహేమీ బౌలర్లు సైతం భారీగా పరుగులు సమర్పించుకున్నారు.
మొదట డిల్లీ బౌలర్లలో మిచెల్ మార్ష్ 4 ఓవర్లేసి 42 పరుగులు ఇచ్చాడు. కానీ అతడికి మూడు వికెట్లు దక్కాయి. ఇక కెప్టెన్ అక్షర్ 3 ఓవర్లలో కేవలం 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ వికెట్లు పడగొట్టలేకపోయాడు. విపిన్ నిగమ్ 2 ఓవర్లలో 35, ముఖేష్ కుమార్ 2 ఓవర్లలో 22, మోహిత్ శర్మ 4 ఓవర్లలో 42, స్టబ్స్ 1 ఓవర్లో 28 పరుగులు సమర్పించారు. కుల్దీప్ యాదవ్ ఒక్కరే పొదుపుగా బౌలింగ్ చేసాడు... అతడు 4 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
లక్నో బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. సిద్దార్థ్ 4 ఓవర్లేసి 39 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దిగ్వేశ్ రథి 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 2 వికెట్లు, రవి బిష్ణోయ్ 4 ఓవర్లలో 53 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టారు. ప్రిన్స్ యాదవ్ 4 ఓవర్లలో 47 పరుగులు, షహబాజ్ అహ్మద్ 1.3 ఓవర్లలో 22 పరుగులు సమర్పించుకున్నాడు.